అప్పు తీసుకున్న మహిళకు వడ్డీ వ్యాపారుల లైంగిక వేధింపులు..తట్టుకోలేక ఆత్మహత్య

  • Publish Date - March 12, 2020 / 09:21 AM IST

అప్పు తీసుకున్న పాపానికి వడ్డీ కోసం వ్యాపారులు వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురు పిల్లల్ని అనాధలుగా మార్చి వేసిన ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం బీరవోలులో చోటుచేసుకుంది. 

బీరవోలుకు చెందిన రామానుజమ్మ అవసరం కోసం వడ్డీ వ్యాపార దగ్గర రూ.2లక్షలు అప్పు తీసుకుంది. తరువాత అసలు వడ్డీ కలిపి మొత్తం రూ.5లక్షలు ఇవ్వాలంటూ వేధింపులు ప్రారంభించారు. దీంతో రామానుజమ్మ అంత డబ్బు ఎలా కట్టేది బాబూ అంటూ వేడుకుంది.కానీ ఐదు లక్షలు ఇవ్వాల్సిందేనంటూ నానా దుర్భాషలాడేవారు. ఇంటికొచ్చి రామానుజమ్మను బూతులు తిట్టేవారు.అశ్లీల పదజాలంతో తీవ్రంగా దూషించేవారు. దీంతో అవమానం తట్టుకోలేక రామానుజమ్మ ఆత్మహత్య చేసుకుంది. దీంతో రామానుజమ్మ ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు.  

Also Read | కేజ్రీవాల్ మార్కు : సామాన్యుడికి అందుబాటులో స్కూల్ ఫీజులు

రామనుజమ్మ ఆత్మహత్యకు కారణం చిన్నమద్దయ్య, పెద్ద మద్దయ్య, లక్ష్మీనారాయణ అనే వడ్డీ వ్యాపారులే కారణమని..అప్పుగా తీసుకున్న రూ.లక్షలకు బదులు మొత్తం రూ.5లక్షలు కట్టాలని వేధించటంతో అప్పు తీర్చే దారిలేక..వ్యాపారులు పెట్టే టార్చర్ భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన రామానుజమ్మ ఆత్మహత్య చేసుకుందని..దీనికి కారణమైన చిన్నమద్దయ్య, పెద్ద మద్దయ్య, లక్ష్మీనారాయణలను కఠినంగా శిక్షించాలని రామానుజమ్మ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె మరణంతో ముగ్గురు చిన్నారులను చూసుకునే స్థోమత కూడా మాకు లేదని వాపోతున్నారు. 

రామనుజమ్మ చిన్నమద్దయ్య, పెద్ద మద్దయ్య, లక్ష్మీనారాయణల దగ్గర రూ.2లక్షలు అప్పు తీసుకుందని..అది ఒక్క సంవత్సరానికే రూ.5లక్షలు అయిందనీ..అప్పటికీ రామానుజమ్మ అప్పు తీర్చకపోవటంతో మరో రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. 

దీంతో అప్పు..వడ్డీ మొత్తం కలిపి రూ.11 లక్షలు అయ్యాయని మొత్తం చెల్లించాలని వ్యాపారులు వేధించే వారనీ..ఈ క్రమంలో  రామానుజమ్మ మా ‘కోరిక’ తీరిస్తే  వడ్డీ కట్టనక్కరేదని రామానుజమ్మ తమ్ముళ్లతో కబురు చేసారు సదరు వ్యాపారులు.దీనికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో వేధింపులు మరింతగా పెరిగాయి. మరోపక్క వ్యాపారుల కోరిక తీరిస్తే వడ్డీ కట్టక్కర్లేదంటున్నారు కదా వాళ్లదగ్గరకు వెళ్లటానికి నీకేంటి అంత పొగరు..అంటూ తమ్ముళ్లు కూడా వేధించటంతో..అండగా ఉండాల్సిన సొంత తమ్ముళ్లే ఇలా వేధిస్తుండటంతో రామానుజమ్మ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.  

See Also | మలక్ పేట ట్రాఫిక్ SI బూతుపురాణం..వీడియో వైరల్