Srikakulam: మరోసారి ఇంట్రెస్టింగ్‌గా మారిన సిక్కోలు రాజకీయాలు.. ఎమ్మెల్యే కూన రవి.. సౌమ్య ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్
ఇప్పుడు పొలిటికల్‌గా సైలెంట్‌గా ఉంటూ..కూన రవి ఇష్యూలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ దువ్వాడ మాట్లాడటం మాత్రం గమ్మత్తుగా మారింది.

Kuna Ravi
Srikakulam: దువ్వాడ శ్రీనివాస్.. ఏడాది క్రితం వరకు శ్రీకాకుళం జిల్లా వరకే ఎక్కువ పరిచయం. ఎమ్మెల్సీగా ఉన్న పెద్దగా వెల్ నౌన్ పర్సనాలిటీ కాదు. వన్స్ దువ్వెల మాధురితో బంధం..ఫ్యామిలీతో డిస్టబెన్స్‌తో ఒక్కసారి తెలుగు స్టేట్స్‌లో హాట్ టాపిక్ అయ్యారు దువ్వాడ శ్రీనివాస్. అంత రచ్చ జరిగినా ఆయనను కొన్నాళ్ల పాటు పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ చేయలేదు.
ఆ తర్వాతే కారణం ఏదైనా దువ్వాడపై బహిష్కరణ వేటు వేసింది వైసీపీ. ఇక కొన్నాళ్లుగా దువ్వెల మాధురితో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న దువ్వాడ..బిజినెస్‌లో బిజీ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్‌గా మీడియాకు ముందుకొచ్చేశారు. ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్-ప్రిన్సిపల్ సౌమ్య వ్యవహారంపై తన వెర్షన్ ఏంటో వినిపించేశారు. ఔట్ రైట్‌గా కూన రవికి సపోర్ట్ చేశారు దువ్వాడ శ్రీను.
కూన-సౌమ్య ఎపిసోడ్‌లోకి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. దీని వెనుక మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు. కావాలనే సౌమ్య బదిలీ అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారంటున్న దువ్వాడ.. కూన రవికుమార్ మంత్రి రేసులో ఉండటంతో అచ్చెన్నాయుడు ఈ కుట్ర చేస్తున్నారని అటాక్ చేశారు. కూన రవి హింసించినట్లు ఆధారాలు ఉన్నాయా.? అని దువ్వాడ ప్రశ్నించడం ఆసక్తికంగా మారింది.
టీడీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు వస్తే ఆ పార్టీకి చెందిన నేత మద్దతుగా మాట్లాడితే పర్లేదు అనుకోవచ్చు. కానీ మొన్నటిదాకా వైసీపీలో ఉండి..ఇప్పుడు ఏ పార్టీతో సంబంధం లేకుండా ఉన్న దువ్వాడ కూన రవికి సపోర్ట్ చేయడం ఏంటనేది చర్చకు దారితీస్తోంది. తాను తటస్థుడ్ని అంటూనే టీడీపీ, అచ్చెన్నాయుడి ఫ్యామిలీని టార్గెట్ చేశారాయన. ఈ క్రమంలో కులాల కుంపటిని రగిల్చే ప్రయత్నం చేశారు దువ్వాడ. టెక్కలి నియోజకవర్గంలో కలింగ సామాజిక వర్గం వారిపై దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఒక్క కులానికే చెందినవారు అటెండర్ నుంచి ఆర్డీవో వరకు ఉన్నారని దువ్వాడ ఆరోపిస్తున్నారు.
రాజమోహన్‌ను ఎందుకు పరామర్శించలేదు?
మధ్యలో ధర్మాన ఫ్యామిలీని కూడా రచ్చలోకి లాగారు దువ్వాడ. మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్‌డీ ఒత్తిడి భరించలేక ఆగ్రోస్ ఎండీ జీఎం రాజమోహన్ సెలవుపై వెళ్లిపోయారని… మరి ఆయనను ధర్మాన కృష్ణదాస్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ప్రిన్సిపల్ సౌమ్యను పరామర్శించిన కృష్ణదాస్..రాజమోహన్‌ను ఎందుకు పరామర్శించలేదో చెప్పాలంటున్నారు దువ్వాడ. అచ్చెన్నాయుడు చెప్పగానే కృష్ణదాసు సౌమ్యను పరామర్శించారని సీరియస్ అలిగేషన్ చేశారు. కూన రవి కుమార్‌ను ప్రశ్నించే ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్‌లు… మంత్రి అచ్చెన్నాయుడును ఎందుక ప్రశ్నించరని అడిగారు.
సరే కూనరవి, ప్రిన్సిపల్ ఎపిసోడ్‌లో ఎవరిది రాంగ్..ఎవరిది కరెక్ట్ అనేది ఇప్పట్లో తేలే అంశం కాదు. కానీ దువ్వాడ ఎంట్రీ మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్‌గా మారింది. కళింగ సామాజికవర్గంపై దాడులు అంటూ..అచ్చెన్నపై బాణాలు ఎక్కుపెట్టడం చర్చకు దారి తీసింది. టెక్కలిలో దువ్వాడ, అచ్చెన్న మధ్య రాజకీయ వైరం ఉంది. ప్రతీ ఎన్నికలప్పుడు ఆ విషయం క్లియర్ కట్‌గా అర్థమవుతుంది.
కానీ ఇప్పుడు పొలిటికల్‌గా సైలెంట్‌గా ఉంటూ..కూన రవి ఇష్యూలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ దువ్వాడ మాట్లాడటం మాత్రం గమ్మత్తుగా మారింది. (Srikakulam)
రాజకీయంగా తాను ఒంటరైన నేపథ్యంలో ఆయన క్యాస్ట్ కార్డు వాడుతున్నారా అన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. ధర్మాన, అచ్చెన్న అంతా ఒక్కటే అంటూ.. కళింగ సామాజికవర్గానికి, అన్ని పార్టీల్లోని ఆ వర్గం నేతలకు దగ్గరయ్యేందుకే కూన రవి, ప్రిన్సిపల్ ఎపిసోడ్ దువ్వాడ దూరారా అన్న డిస్కషన్ జరుగుతోంది. ఏదైనా ఇప్పుడు దువ్వాడ ఎంట్రీ..సిక్కోలు పొలిటికల్ పిక్చర్‌లో క్యామియో రోల్‌ను గుర్తు చేస్తుందని అంటున్నారు.