పవన్ కళ్యాణ్‌కు అభిమాని చెప్పులు గిఫ్ట్
- Subhan Ali Shaik
- Published On : August 30, 2019 / 07:54 AM IST
రెండ్రోజుల పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి మంగళగిరి పాత బస్టాండ్‌కు చేరుకున్నారు. స్థానికులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులతో ఆత్మీయంగా కాసేపు మాట్లాడారు. తమ వద్ద ఉన్న ఫిర్యాదులను జాబితా రూపంలో అందించారు అభిమానులు.
ఒక అభిమాని అమరావతి పర్యటన మొత్తం తాను ఇచ్చిన చెప్పులు వేసుకుని పర్యటించాలని కోరాడు. నవ్వుతూ చెప్పులు తీసుకున్నాడు జనసేనాని. అక్కడి నుంచి అభిమానులతో కలిసి ర్యాలీగా రాజధాని అభివృద్ధి పనులు సమీక్షించేందుకు వెళ్లారు. నిడమర్రులోనూ పర్యటించిన పవన్ అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు.
పర్యటనలో భాగంగా పురగల్లు, ఐనవోలు, కొండవీటి వాగు బ్రిడ్జి, ఎస్సారెమ్ యూనివర్సిటీ, శాఖమూరు, విట్ యూనివర్సిటీ, శిల్పా రామం, అంబేద్కర్ స్మృతి వనాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత ఎన్జీవో క్వార్టర్స్, సచివాలయం, హైకోర్టు, మంత్రులు, జడ్జిల భవనాల నిర్మాణాలను పరిశీలిస్తారు. ఐఏఎస్ లతో పాటు సీఆర్డీఏ బిల్డింగ్ పనులను పరిశీలిస్తారు.
