Pawan Sister (1)
Pawan Kalyan Sister: తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పార్టీ మారనున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి. కనీసం డిపాజిట్ కూడా రాకపోవడంతో ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు కనిపించలేదు.
ప్రచార సమయంలో జనసేన కార్యకర్తలను ఇంప్రెస్ చేయడానికి జనసేన పార్టీ కండువా కూడా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ కు రాఖీ కట్టి సోదరుడిలా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పుడేమో వైస్సార్ కాంగ్రెస్ చేరుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, సీఎం వైఎస్ జగన్ కు ఈ మాజీ సివిల్ సర్వెంట్ అభిమాని అని తెలుస్తుంది. బీజేపీలో జాయిన్ అయినప్పటికీ వీరి పైనే పొగడ్తలు కురిపించింది. ఈ కారణంగానే ఆమె చాలా విమర్శలు ఎదుర్కొన్నారు.