PM Kisan – Annadata Sukhibhava : ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. దసరా ముందే ఖాతాల్లో ఒకేసారి రూ.6వేలు..?
PM Kisan - Annadata Sukhibhava : దసరా పండుగకు ముందే ఏపీ రైతుల ఖాతాల్లో రూ.6,000 జమ అవుతాయా? పీఎం కిసాన్ 24వ విడత, అన్నదాత సుఖీభవ నిధుల విడుదల అంచనాలు, అర్హతలు, చెల్లింపు వివరాలివే..
PM Kisan - Annadata Sukhibhava
- రైతులకు దసరా కానుక? ఖాతాల్లో ఒకేసారి డబ్బులు పడతాయా?
- పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ డబ్బులు కలిపి వస్తాయా?
- రైతులు అలర్ట్.. రూ.6వేలు పడాలంటే ఇవి తప్పనిసరి
PM Kisan – Annadata Sukhibhava : పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రైతులకు బిగ్ అలర్ట్.. దసరా పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆర్థిక సాయం అందనుందనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా జమ కావచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పథకాల ద్వారా అర్హులైన రైతులకు ఒకేసారి రూ.6వేలు అందే అవకాశం ఉంది.అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు? :
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6వేలు అందిస్తారు. ఈ మొత్తాన్ని 3 విడతల్లో రూ.2వేలు చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
2026 జూన్లో 23వ విడత విడుదల కాగా ఇప్పుడు రైతులు 24వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 17 లేదా 18 తేదీల్లో డబ్బులు విడుదల కావచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తేదీని ప్రకటించే వరకు ఆగాల్సిందే..
Read Also : TTD SSD Tokens : శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేస్తున్నారా? తిరుమలలో SSD, DD టోకెన్లు బంద్.. ఎప్పటివరకంటే?
అన్నదాత సుఖీభవ డబ్బులు ఎంత? :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హులైన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి ఏడాదికి రూ.20వేలు అందించాలనేది లక్ష్యం. ఇందులో కేంద్రం నుంచి రూ.6వేలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14వేలు లభిస్తాయి.
విడతల వారీగా నిధులు విడుదల కానున్నాయి. పీఎం కిసాన్ నుంచి రూ.2వేలు, రాష్ట్ర వాటా నుంచి రూ.4వేలు కలిపి మొత్తం రూ.6వేలు అందే అవకాశం ఉంది.అయితే, ప్రతి రైతుకు ఒకేసారి ఈ మొత్తం వస్తుందని చెప్పలేం. అర్హతలు, చెల్లింపుల షెడ్యూల్, ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
రైతులకు ఈ పనులు తప్పనిసరి :
ఖాతాల్లో డబ్బులు పడాలంటే రైతులు పీఎం కిసాన్ ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ లింక్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. అలాగే, భూమి వివరాలు, రైతు రిజిస్ట్రీ నమోదు పూర్తయ్యాయో లేదో సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించి తెలుసుకోండి.
డబ్బులు పడ్డాయో లేదో ఎలా చూడాలి? :
పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో లబ్ధిదారుల వివరాలు, పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ డబ్బుల సమాచారం కోసం ఏపీ ప్రభుత్వ ప్రకటనలను, వ్యవసాయ శాఖ అధికారిక సమాచారాన్ని తెలుసుకోండి.
గమనిక : పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవకు సంబంధించి దసరా లోపు రూ.6వేలు జమ అవుతాయనే వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేంతవరకు రైతులు వేచి చూడాల్సిందే..
