ఇంత పెద్ద స్కెచ్ వేసింది చంద్రబాబే: సజ్జల రామకృష్ణారెడ్డి
Sajjala Ramakrishna Reddy: దోపిడీదారులకు చంద్రబాబు నాయకుడని సజ్జల అన్నారు.

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇవాళ సజ్జల తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. చంద్రబాబు దాదాపు లక్ష కోట్ల రూపాయల స్కామ్ చేశారని ఆరోపించారు.
ఇంత పెద్ద స్కెచ్ వేసింది చంద్రబాబేనని అన్నారు. ఐఎంజీ అనే ఓ బోగస్ కంపెనీకి చంద్రబాబు 250 ఎకరాల భూమిని కట్టబెట్టారని సజ్జల చెప్పారు. దోపిడీదారులకు చంద్రబాబు నాయకుడని అన్నారు.
పొత్తులపై సజ్జల కామెంట్స్
- వెంటిలేటర్ పై ఉన్న పార్టీని బతికించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు..
- రెండురోజుల నుండి ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు..
- జగన్ ను ఎదుర్కోవడానికి ప్రపంచంలో ఉన్న శక్తులు అని ఏకం చేసేందుకు చూస్తున్నారు..
- పొత్తులు చంద్రబాబుకి అలవాటే.. కొన్నిసార్లు లాభపడ్డారు.. కొన్ని సార్లు విఫలం అయ్యారు..
- ఈసారి విచిత్రంగా బీజేపీతో పాటు కాంగ్రెస్ తోనూ పరోక్షంగా పొత్తులు పెట్టుకుంటున్నారు..
- ఇలాంటప్పుడే మా బలం మాకు తెలుస్తుంది.. వాళ్ల బలహీనత కనిపిస్తుంది..
- ఏ నియోజకవర్గంలో అయినా 50 శాతం కంటే ఎక్కువ ఓటు షేర్ మాకు ఉంది..
- టిడిపి జీరో పార్టీ.. జీరో పక్కన ఎన్ని జీరో లు కలిసినా జీరో నే..
- బిజెపికి ఏపిలో ఎంత బలం ఉందో అందరికి తెలుసు..
- మేము ఎన్నికలను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం.. వాళ్ళు ఇంకా ప్రొసెస్ మొదలు పెట్టలేదు..
Also Read: లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే.. 150 సభలు.. దక్షిణాదిన..