CM Vijay-Vishnu Reddy : తమిళనాడు విజయ్ అత్యంత సన్నిహితుల శిబిరంలో.. తెలుగు మాజీ సీఎం బావమరిది..
CM Vijay-Vishnu Reddy : గత రెండు రోజులుగా తమిళ మీడియా, సోషల్ మీడియాలో ఓ వ్యక్తి గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కారణం ఆ వ్యక్తి ఓ తెలుగు ముఖ్యమంత్రికి బావమరిది కావడంతో అందరికి ఆసక్తి నెలకొంది.
Tamil nadu cm tvk Vijay Camp Former CM Kiran Brother in Law Vishnu Reddy
CM Vijay-Vishnu Reddy : గత రెండు రోజులుగా తమిళ మీడియా, సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. కారణం ఆ ఫోటోలోని వ్యక్తి తమిళనాడు సీఎంకి అత్యంత సన్నిహితుడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆయన స్వయంగా ఓ తెలుగు ముఖ్యమంత్రికి బావమరిది. దీంతో ఈ ఫోటో, ఆ వ్యక్తి తమిళ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశారు. తమిళనాడు సీఎం విజయ్ రెండు రోజుల కిందట ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరుతూ గవర్నర్ అర్లేకర్‌ను కలిసిన సందర్భంగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిలో గవర్నర్‌కు ఎడమ వైపు ఉన్న రెండో వ్యక్తి విష్ణు రెడ్డి. ఇతడు విజయ్‌కి అత్యంత సన్నిహితుడు.
ఇంతకూ ఆ వ్యక్తి పేరు ఏంటంటే విష్ణు రెడ్డి. ఈయనను గ్రానైట్ క్వారీల యజమానిగా చెబుతున్నారు. విష్ణు రెడ్డి పూర్తి పేరు ఎర్రదొడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. ఈయన స్వస్థలం కలికిరి మండలం ఎర్రదొడ్డిపల్లె. గత పదిహేనేళ్లుగా ఆయన చెన్నైలోనే గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన తండ్రి రామనారాయణ రెడ్డి కాగా.. ఆయన అడ్డవారిపల్లె సర్పంచ్‌గా, మహల్ ఎంపీటీసీగా, కలికిరి మండల పరిషత్ వైస్ ఎంపీపీగా పనిచేశారు. విష్ణు రెడ్డి తల్లి స్వయానా కలికిరి మాజీ ఎంపీపీ నల్లారి ఆనంద రెడ్డి సోదరి. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్ కుమార్ రెడ్డి సోదరిని కూడా ఆ కుటుంబంలోని వారికే ఇచ్చి వివాహం చేశారు. మొత్తంగా చూసుకుంటే విష్ణు రెడ్డి.. కిరణ్‌కుమార్ రెడ్డికి బావమరిది అవుతారు.
*రంగంలోకి దిగిన స్టాలిన్.. విజయ్ తొలి ప్రసంగంపై ఘాటు వ్యాఖ్యలు.. ఇక ముందుంది ముసళ్ల పండగ..!
విష్ణు రెడ్డి ఉమ్మడి కుటుంబ ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాడు సీఎం శిబిరంలో ప్రధానమైన వ్యక్తిగా ప్రచారంలో ఉన్న విష్ణు రెడ్డి.. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి కుటుంబానికి సమీప బంధువు మాత్రమే కాక సొంత మండలానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటు కసరత్తులో భాగంగా.. టీవీకే విజయ్ గవర్నర్‌ను కలవడానికి వెళ్లిన సమయంలో.. ఆయనతో పాటు విష్ణు రెడ్డి వెళ్లడం అంటే.. అక్కడ ఆయనకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ మీడియా, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
*విజయ్ రిమోట్ స్టాలిన్ చేతిలో..!
అయితే విష్ణు రెడ్డి విజయ్‌కు చాలా ఏళ్లుగా అత్యంత సన్నిహితుడని, టీవీకే పార్టీ వ్యూహకర్త అని, ఆర్థిక వ్యవహారాల్లో సహాయకారిగా ఉన్నారని కూడా చెబుతున్నారు. విజయ్ సినిమాల పర్యవేక్షణ విషయాల్లో కూడా విష్ణు రెడ్డి చురుగ్గా ఉన్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మొత్తానికి తెలుగు వ్యక్తి తమిళ సీఎంకి అత్యంత సన్నిహితుడు కావడం రెండు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది.
