Chandrababu: ఆంధ్రప్రదేశ్ తీవ్ర విద్యుత్ కోతలపై చంద్రబాబు ట్వీట్
విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయిందంటూ విమర్శిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. విద్యుత్ కోతల కారణంగా ప్రసూతి ఆసుపత్రుల్లో
- Subhan Ali Shaik
- Published On : April 7, 2022 / 03:58 PM IST
Power Cut
Chandrababu: విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయిందంటూ విమర్శిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. విద్యుత్ కోతల కారణంగా ప్రసూతి ఆసుపత్రుల్లో బాలింతల పరిస్థితి దయనీయంగా మారిందని వివరిస్తూ వీడియోను జత చేశారు.
”తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారు. గ్రామాల్లో అనధికార పవర్ కట్‌లతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ సరఫరా లేక ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు పడుతున్న బాధలకు ఈ సీఎం ఏం సమాధానం చెపుతారు? నాడు మిగులు విద్యుత్‌తో వెలుగులు నిండిన రాష్ట్రంలో ప్రస్తుత చీకట్లకు కారణం ఎవరు?”
“రాష్ట్రంలో అసలు కరెంట్ ఎందుకుపోతోంది? భారీగా పెరిగిన బిల్లులు ప్రజలు కిమ్మనకుండా కడుతున్నప్పటికీ ఈ కోతలు ఎందుకు విధిస్తున్నారు. ఓవైపు గ్రామగ్రామాన ప్రజలు కరెంట్ లేక రోడ్డెక్కుతుంటే.. వాలంటీర్లకు సన్మానం అంటూ రూ.233 కోట్లు తగలేస్తూ పండుగ చేసుకుంటున్న ఈ సీఎం ఇంకేమనాలి? విద్యుత్ కోతలను ప్రశ్నించిన సామాన్య ప్రజలపై బెదిరింపులు మాని..సమస్యను పరిష్కరించండి” అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు.
