TDP First List: స్థానిక సమరానికి టీడీపీ తొలి జాబితా విడుదల.. 7 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలకు అభ్యర్థుల ప్రకటన!
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 36 మంది అభ్యర్థులతో టీడీపీ తన తొలి జాబితాను(TDP First List) విడుదల చేసింది.
Tdp releases first list 36 candidates ap local body elections
TDP First List: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. కూటమి సీట్ల సర్దుబాటు ముగియడంతో తెలుగుదేశం పార్టీ తొలి విడతగా 36 మంది స్థానిక సంస్థల అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా పొత్తులో భాగంగా పొందిన 11 కార్పొరేషన్లలో 7 మేయర్ స్థానాలకు, అలాగే 78 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 29 చైర్పర్సన్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాలో(TDP First List) సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు విస్తృతంగా అవకాశాలు కల్పించారు.
7 కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థుల పేర్లు:
- కర్నూల్ మేయర్ అభ్యర్థి: విజయ ప్రత్యూష
- కడప మేయర్ అభ్యర్థి: నెల్లుటూరి సువర్ణ
- నెల్లూరు మేయర్ అభ్యర్థి: రూప్ కుమార్
- విశాఖపట్నం మేయర్ అభ్యర్థి: ముక్కా శ్రావణి
- విజయనగరం మేయర్ అభ్యర్థి: అనవపు భార్గవి
- చిత్తూరు మేయర్ అభ్యర్థి: కటారి హేమలత
- తిరుపతి మేయర్ అభ్యర్థి: మన్నెం శ్రీనివాస ప్రసాద్
29 మున్సిపాలిటీల చైర్పర్సన్ అభ్యర్థుల పేర్లు:
- ఆళ్లగడ్డ: అనీషా షేక్
- అద్దంకి: కాకాని అశోక్
- ఆదోని: నాగమణి
- ఆత్మకూరు: గోవిందరాజులుబద్వేలు: దివ్యతేజ
- బొబ్బిలి: రేణుకాదేవి
- దాచేపల్లి: టి.శ్రీనివాసరావు
- ధర్మవరం: పరిశె సుధాకర్మాచర్ల: ఏనుముల సుష్మ
- మదనపల్లె: చిన్నబాబు
- మార్కాపురం: మల్లికార్జున
- నగరి: శ్రీనివాసన్
- పలాస కాశీబుగ్గ: వజ్జ గంగాభవాని
- పెద్దాపురం: LSN రాజు
- పెనుకొండ: త్రివేంద్రమూర్తి
- పులివెందుల: గీతాకుమారి
- రాజంపేట: గాయత్రి
- రామచంద్రపురం: శేషారావు
- రాయచోటి: ఖాదర్ వలీ
- రాయదుర్గం: హనుమంతు
- రేపల్లె: అపర్ణ
- సూళ్లూరుపేట: సుహాసిని
