TDP Twitter AC Hack: తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. మారిన డీపీ, ఖాతా పేరు

టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవ్వడం వెనుక అధికార వైసీపీ దుష్టశక్తులు ఉన్నాయని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై సైబర్ క్రైంకి ఫిర్యాదు చేశామని, తొందరలోనే పునరుద్దరిస్తామని వారి నుంచి హామీ అందినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. గతంలో కూడా ఒకసారి టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది.

TDP Twitter AC Hack: తెలుగు దేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్‭ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. అనంతరం అకౌంట్ పేరు మార్చేశారు. ఇక ఆ ఖాతాలో ఏవేవో ట్వీట్లు కూడా చేస్తున్నారు. అకౌంట్ పేరును ‘టైరల్ హాబ్స్’ అని మార్చారు. ఇక బయోలో ‘‘అల్గారిథమ్స్, ప్లాటర్స్, పెయింట్‌తో పని చేసే విజువల్ ఆర్టిస్ట్. కొన్నిసార్లు నా సైట్‌లో కళ గురించి రాస్తాను. ఫిండెంజా సృష్టికర్త, క్యూక్యూఎల్ సహ-సృష్టికర్త’’ అని రాసుకొచ్చారు.

దీంతో పాటు ట్విట్టర్ ఐడీ డీపీ కూడా మారిపోయింది. మనిషి అవతార్ తలను డీపీగా మార్చారు. కాగా, టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవ్వడం వెనుక అధికార వైసీపీ దుష్టశక్తులు ఉన్నాయని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై సైబర్ క్రైంకి ఫిర్యాదు చేశామని, తొందరలోనే పునరుద్దరిస్తామని వారి నుంచి హామీ అందినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. గతంలో కూడా ఒకసారి టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది.

Rajastan Crisis: రాజస్తాన్ సీఎంగా తానే కొనసాగుతానని పరోక్ష సూచనలు చేసిన గెహ్లాట్

ట్రెండింగ్ వార్తలు