Vijayawada Incident: ప్రాణం తీసిన కొబ్బరిబోండం.. ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కుటుంబ పెద్దల దుర్మరణం
కారులో ఉన్న ఒక కొబ్బరిబోండం బ్రేక్, క్లచ్ మధ్య ఇరుక్కుపోవడం రెండు కుటుంబాల్లో(Vijayawada Incident) తీరని లోటును మిగిల్చింది.
Two people died in an accident caused by a tender coconut getting stuck
- కొబ్బరిబోండం తెచ్చిన ఘోర ప్రమాదం
- ఇద్దరు కుటుంబ పెద్దల దుర్మరణం
- రెండు కుటుంబాల్లో పెను విషాదం
Vijayawada Incident: వాహన ప్రయాణాల్లో చిన్నపాటి అజాగ్రత్త లేదా ఊహించని అవరోధం ఎంతటి పెను విషాదాన్ని నింపుతుందో చెప్పడానికి విజయవాడ సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదమే ఒక ఉదాహరణ. కారులో ఉన్న ఒక కొబ్బరిబోండం బ్రేక్, క్లచ్ మధ్య ఇరుక్కుపోవడం అనే నమ్మశక్యం కాని కారణం.. రెండు కుటుంబాల్లో తీరని లోటును మిగిల్చింది. కుమారుడి పెళ్లి వేడుక ముగించుకుని సంతోషంగా ఇంటికి వస్తున్న ఒకరు, మందుల కోసం వెళ్లి కొడుకుతో కలిసి తిరిగి వస్తున్న మరొకరు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.
Minister Atchannaidu: రొయ్యలకు రోగం… తినేవాళ్లు, రైతులు బీ కేర్ ఫుల్.. రంగంలోకి ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్‌లో తన చిన్న కుమారుడి వివాహాన్ని వైభవంగా ముగించుకుని రాజమహేంద్రవరానికి కారులో బయలుదేరారు పురోహితుడు దువ్వూరి హరిప్రసాద్ (52). విజయవాడ(Vijayawada Incident) వెస్ట్ బైపాస్‌పై జక్కంపూడి, షాబాద్‌ల మధ్య అండర్ పాస్ వద్దకు వచ్చేసరికి, కారు వెనుక సీటులో ఉన్న కొబ్బరిబోండం ఒక్కసారిగా ఎగిరి వచ్చి బ్రేక్, క్లచ్‌ల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో కారు అదుపుతప్పి, ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టి, ఆపై రోడ్డు పక్కనే ఆపి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ తీవ్రమైన ప్రమాదంలో కారు నడుపుతున్న హరిప్రసాద్ అక్కడికక్కడే కన్నుమూశారు.
మరోవైపు, బైక్‌పై ప్రయాణిస్తున్న పాయకాపురానికి చెందిన సూరిబోయిన గురవయ్య, అతని కుమారుడు హరికృష్ణలకు తీవ్ర గాయాలయ్యాయి. కొంతకాలం క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న గురవయ్య, గుంటూరుకు మందుల కోసం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ గురవయ్య మరణించారు. బోయమడుగులలో వీఆర్ఏగా పనిచేస్తున్న గురవయ్య, అటు పురోహితుడు హరిప్రసాద్.. ఇద్దరూ తమ కుటుంబాలకు పెద్ద దిక్కు కావడంతో, ఆయా కుటుంబాల్లో ప్రస్తుతం పెను విషాదం అలుముకుంది.
