Kanaka Durga Free Darshan: విజయవాడ దుర్గమ్మ భక్తులకు బిగ్ గుడ్ న్యూస్.. దసరాకు ఉచిత దర్శనాలు.. ఆ విధానం పూర్తిగా రద్దు!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ(Kanaka Durga Free Darshan) భక్తులకు ఆలయ అధికారులు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు.
Vijayawada kanaka durga temple dasara free darshan for devotees ticket system banned
Kanaka Durga Free Darshan: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ(Kanaka Durga Free Darshan) భక్తులకు ఆలయ అధికారులు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల కోసం అన్ని క్యూలైన్లను ఉచితంగా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం అమలులో ఉన్న రూ.100, రూ.300, రూ.500 దర్శన టికెట్ల విధానాన్ని దసరా ఉత్సవాల తొమ్మిది రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉత్సవాల వేళ ఇంద్రకీలాద్రికి విపరీతంగా పెరిగే భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని, సామాన్యులకు ఎలాంటి అవస్థలు లేకుండా సులభంగా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడమే లక్ష్యంగా పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది.
Yanamala Krishnudu: వైసీపీ పార్టీకి యనమల కృష్ణుడు రాజీనామా.. తుని రాజకీయంలో సంచలనం
వీఐపీలు, సిఫార్సుల కోసం రూ.1000 ప్రత్యేక టికెట్ – సమయ వేళలు ఇవే:
ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అధికారిక సిఫార్సు లేఖలతో వచ్చే భక్తుల కోసం ‘భవానీ ప్రత్యేక దర్శనం’ పేరుతో రూ.1000 టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు కుమ్మరిపాలెం, కాళేశ్వరరావు మార్కెట్, స్వరాజ్య మైదానం కేంద్రాలలో ఆఫ్ లైన్ లోనూ కొనుగోలు చేయవచ్చు. రూ.1000 టికెట్ తీసుకున్న భక్తులను ప్రత్యేక వాహనాల్లో కొండపైకి చేర్చి వేగంగా దర్శనం కలిగిస్తారు. ఈ ప్రత్యేక దర్శనాలు రోజంతా అందుబాటులో ఉండవు; ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఒక్కో ట్రిప్‌కు రెండు గంటల చొప్పున మాత్రమే అనుమతిస్తారు.
సామాన్య భక్తుల కోసం 5 క్యూలైన్లు – ఇంద్రకీలాద్రిపై పకడ్బందీ ఏర్పాట్లు:
సామాన్య భక్తుల రద్దీని నియంత్రించేందుకు వినాయక ఆలయం, కుమ్మరిపాలెం వద్ద నుండి మొత్తం ఐదు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్ రోడ్డు వద్ద ఇవి మూడు క్యూలైన్లుగా మారి, మళ్లీ టర్నింగ్ పాయింట్ వద్ద ఐదు క్యూలైన్లుగా రూపాంతరం చెందుతాయి. తొమ్మిది రోజుల పాటు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రతి ఒక్కరికీ దుర్గమ్మ దర్శనం లభించేలా ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
