Nayara Hikes Fuel Price : వినియోగదారులకు భారీ షాక్.. పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెంచిన నయరా.. లీటరు మీద ఎంతంటే..
Nayara Hikes Fuel Price : ప్రైవేటు ఇంధన విక్రయ కంపెనీ నయారా వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది.
- Dharani Pilli
- Updated on- March 26, 2026 / 03:50 PM IST
nayara hikes fuel price rs 5 per liter on petrol and rs 3 per on diesel
Nayara Hikes Fuel Price : ఇరాన్, అమెరికా యుద్ధం.. మన దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇంధన కొరత వార్తల నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద జనాలు బారులు తీరారు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు చమురు కంపెనీ పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు భారీ షాకిచ్చింది. లీటర్ మీద ఏకంగా రూ.5, రూ.3 పెంచింది. ఇంతకు ఆ కంపెనీ అంటే దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ కంపెనీ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రేట్ల పెంపు తర్వాత హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.107.46కు చేరింది.
ఈ క్రమంలో పెట్రోల్ లీటరు మీద రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచుతూ నయారా కంపెనీ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఈ పెంపు అనేది ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ మీద ఆధారపడనుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ పెంపు గరిష్ఠంగా రూ.5.30 వరకు ఉండనుంది. మన దేశంలో సుమారు లక్షకు పైగా పెట్రోలు బంకులు ఉండగా.. రష్యా చమురు సంస్థ అయిన రాస్‌నెఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీ కంపెనీ ఇండియాలో.. సుమారు 6,967 పెట్రోల్ పంపులను ఆపరేట్ చేస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో మన దగ్గర కూడా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచినట్లు పేర్కొంది.
ఇదిలా ఉంటే ప్రభుత్వరంగ చమురు కంపెనీలైన హెచ్‌పీసీఎల్ (HPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), బీపీసీఎల్ (BPCL)లు సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పూ చేయలేదు. కానీ ప్రీమియం పెట్రోల్ ధరను మాత్రం పెంచాయి. అలానే ఇండస్ట్రియల్ డీజిల్ ధరను కూడా సవరించాయి.
