2023 Year-End Discounts : హోండా కార్లపై రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్.. ఏ మోడల్ కారు ధర ఎంత తగ్గిందంటే?

2023 Year-End Discounts : కొత్త కారు కొంటున్నారా? హోండా కార్స్ ఇండియా అమేజ్, సిటీ, సిటీఇ: హెచ్‌ఈవీతో సహా మొత్తం సెడాన్ కార్ల మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. పూర్తి వివరాలను మీకోసం అందిస్తున్నాం. 

2023 Year-End Discounts : హోండా కార్లపై రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్.. ఏ మోడల్ కారు ధర ఎంత తగ్గిందంటే?

2023 Year-End Discounts _ Honda Cars India offers benefits up to Rs 1 lakh, Check Full Details

2023 Year-End Discounts : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ, జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా ఇటీవల లాంచ్ చేసిన ఎలివేట్ మినహా ప్రస్తుత రేంజ్ వాహనాలపై భారీ తగ్గింపులను అందిస్తోంది. 2023 డిసెంబర్‌‌లో రూ. 1 లక్ష వరకు విలువైన డీల్స్‌ను అందిస్తుంది. ఎక్స్ఛేంజ్ బోనస్, ఎక్స్ఛేంజ్ కార్పొరేట్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది.

హోండా సిటీ ఇ:హెచ్ఈవీ :
సిటీ హైబ్రిడ్ వెర్షన్, ఇ:హెచ్ఈవీ రూ. 1 లక్ష వరకు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. హోండా యజమానులు తమ పాత వాహనాన్ని హోండా సిటీ ఇ:హెచ్‌ఇవికి ఎక్స్ఛేంజ్ చేసుకునేందుకు పూర్తిగా రూ. 1 లక్ష క్యాష్ డీల్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ డీలర్ నుంచి డీలర్‌కు మారుతూ ఉంటుంది. ప్రస్తుతం, హైబ్రిడ్ సిటీ వి, జెడ్ఎక్స్ సెన్సింగ్ అనే రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. హోండా సిటీ వి మోడల్ ధర రూ. 18.89 లక్షలు, జెడ్ఎక్స్ సెన్సింగ్ ధర రూ. 20.39 లక్షలు, ఢిల్లీ ఎక్స్-షోరూమ్ వద్ద అందుబాటులో ఉంది.

Read Also : Flipkart Big Year End Sale : ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఐఫోన్ 14 నుంచి పిక్సెల్ ఫోన్ల వరకు భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్‌పై ఎంత తగ్గిందంటే?

హోండా సిటీ :
ఐదో జనరేషన్ సిటీ రూ. 88,600 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ డీల్ రూ. 25వేల వరకు క్యాష్ ఆఫర్ లేదా రూ. 26,947 విలువైన యాక్సెసరీస్, రూ. 15వేల కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4వేల లాయల్టీ బోనస్, రూ. 6వేల హోండా కార్ ఎక్స్ఛేంజ్ స్కీమ్‌తో అందిస్తుంది. రెండు కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. రూ. 20వేల ప్రత్యేక డీల్, ప్రామాణిక రూ. 5వేల వరకు ఉంటుంది.

2023 Year-End Discounts _ Honda Cars India offers benefits up to Rs 1 lakh, Check Full Details

2023 Year-End Discounts 

అందులో విఎక్స్, జెడ్ఎక్స్ వేరియంట్‌లు రూ. 13,651 విలువైన 5 ఏళ్లు ఎక్స్‌టెండెడ్ వారంటీతో వస్తాయి. మరోవైపు, ఎలిగెంట్ ఎడిషన్ వేరియంట్‌లో రెండు ఆఫర్‌లు ఉన్నాయి. అందులో రూ. 10వేలకి కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 40వేల విలువైన స్పెషల్ ఎడిషన్ బెనిఫిట్ అందిస్తుంది. హోండా సిటీ కార్ల ధర రూ. 11.63 లక్షల నుంచి రూ. 16.11 లక్షల వరకు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ అందుబాటులో ఉంది.

హోండా అమేజ్ :
అమేజ్ డిసెంబర్ డిస్కౌంట్ రూ.77వేల వరకు ఉంది. ఎస్ వేరియంట్‌లో రూ. 35వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ. 42,444 విలువైన యాక్సెసరీలు, రూ. 15వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 20వేల ప్రత్యేక కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 4వేల లాయల్టీ బోనస్‌తో వస్తుంది. ఇ-ట్రిమ్ రూ. 15వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 18,148 వరకు అప్లియన్సెస్ రూ. 4వేల లాయల్టీ బోనస్, రూ. 3వేల కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 20వేల ప్రత్యేక కార్పొరేట్ డిస్కౌంట్, రూ.15వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌తో వస్తుంది.

మరోవైపు, అమెజ్ విఎక్స్ వేరియంట్‌లో రూ. 25వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ. 30,245 వరకు యాక్సెసరీలు, రూ. 15వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 20వేల ప్రత్యేక కార్పొరేట్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3వేలు, కార్పొరేట్ బోనస్ రూ. 4వేలు వరకు అందిస్తుంది. అమేజ్ మోడల్ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.10 లక్షల నుంచి రూ.9.86 వరకు ఉంది.

Read Also : WhatsApp Pin Chat : వాట్సాప్‌లో కొత్త పిన్ చాట్ ఫీచర్.. ముఖ్యమైన మెసేజ్‌లను ఈజీగా పిన్ చేసుకోవచ్చు!