2026 Mini Countryman C : కొత్త కారు కొంటున్నారా? అదిరే డిజైన్, లగ్జరీ ఫీచర్లతో మినీ కంట్రీమ్యాన్- సీ వచ్చేస్తోంది.. ఫుల్ డిటెయిల్స్!
2026 Mini Countryman C : భారత మార్కెట్లో 2026 కంట్రీమ్యాన్-సీ లాంచ్ తేదీని మినీ ధృవీకరించింది. ఈ ప్రీమియం SUV జూన్ 17న లాంచ్ కానుంది. ఈ కొత్త వేరియంట్, ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
2026 Mini Countryman C
- జూన్ 17నే 2026 కంట్రీమ్యాన్-సీ భారత్ లాంచ్
- 5 కలర్ ఆప్షన్లలో 2026 మినీ కంట్రీమ్యాన్-సీ రానుంది
- మినీ కంట్రీమ్యాన్-సీ కారు ధర రూ. 64.9 లక్షలు ఉండొచ్చు
2026 Mini Countryman C : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 2026 కంట్రీమ్యాన్-సీ భారత్ లాంచ్ తేదీని మినీ ధృవీకరించింది. ఈ ప్రీమియం ఎస్యూవీ జూన్ 17న లాంచ్ కానుంది. ఈ కొత్త వేరియంట్ ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఈ రేంజ్లో మినీ కంట్రీమ్యాన్-సీ అత్యంత సరసమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ ఎస్యూవీ భారత మార్కెట్లో స్థానికంగా అసెంబుల్ కానుంది. తద్వారా కంపెనీ భారత మార్కెట్లో మరింత పోటీ ధరకే అందించే అవకాశం ఉంది.
ఎక్స్‌ట్రనల్ డిజైన్ :
ఎక్స్‌ట్రనల్ డిజైన్ పరంగా 2026 మినీ కంట్రీమ్యాన్-సీ 5 కలర్ ఆప్షన్లలో రానుంది. చిల్లీ రెడ్, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, ననుక్ వైట్, స్లేట్ బ్లూ, స్మోకీ గ్రీన్ ఉన్నాయి. మొత్తం డిజైన్ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ మాదిరిగానే ఉంటుంది. గ్రిల్, బంపర్ ఉండవచ్చు.
ఇతర ఫీచర్లలో బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ ORVM హౌసింగ్‌లు, బ్లాక్ డోర్ పిల్లర్స్ రూఫ్ ఉన్నాయి. షాంపేన్-కలర్ ఎక్స్టీరియర్ ట్రిమ్, అల్లాయ్ వీల్స్, మ్యాట్రిక్స్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ కూడా ఉండొచ్చు.
Read Also : Bajaj Avenger 220 Street : బజాజ్ నుంచి మాస్ కంబ్యాక్.. అవెంజర్ 220 స్ట్రీట్ బైక్ మళ్లీ వచ్చేసింది!
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
క్యాబిన్ ఇంటీరియర్, కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్‌తో సహా మినీ మోడళ్ల మాదిరిగానే డిజైన్ ఉండొచ్చు. ఇందులో డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్, షాంపేన్ కలర్ ట్రిమ్, బ్రాండ్ సర్కిల్ టచ్‌స్క్రీన్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, ప్యాడిల్ షిఫ్టర్లు, హెడ్-అప్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉండొచ్చు.
ఇంజిన్ :
కంట్రీమ్యాన్-సీ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ డైరెక్ట్-ఇంజెక్షన్ ఇంజన్‌తో వస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్మిషన్ అందిస్తుంది. మినీ ఇండియా ఈ వెర్షన్ కచ్చితమైన అవుట్‌పుట్‌ను ఇంకా వెరిఫై చేయలేదు.
కానీ, బీఎండబ్ల్యూ ఎక్స్1కి పవర్ అందించే అదే 3-సిలిండర్ ఇంజన్ వస్తుందని భావిస్తున్నారు. ఆ మోడల్లో ఈ ఇంజన్ 136hp, 230Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కంపేర్ చేస్తే.. కంట్రీమ్యాన్ జేసీడబ్ల్యూ ఆల్4, 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్, 300hp, 400Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ధర ఎంతంటే? :
2026 మినీ కంట్రీమ్యాన్-సీ కారు ధర ప్రస్తుతం రూ. 64.9 లక్షల (ఎక్స్-షోరూమ్)కు లభించనుంది. ఫ్లాగ్షిప్ జేసీడబ్ల్యూ ఆల్4 కన్నా తక్కువగా ఉంటుంది. భారత మార్కెట్లో బీఎండబ్ల్యూ ఎక్స్1, ఆడి క్యూ3, మెర్సిడెస్-బెంజ్ జీఎల్ఏలతో ఈ కారు పోటీపడుతుంది. తద్వారా మినీ ప్రీమియం SUV లైనప్‌లో కీలక మోడల్‌గా చెప్పొచ్చు.
