7 Best Phones : తగ్గేదేలే.. 2026లో ఐఫోన్ 17 ప్రోకు గట్టి పోటీనిచ్చే 7 బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు.. ఏది కొంటారంటే?

7 Best Phones : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కన్నా అదిరిపోయే ఫీచర్లతో భారతీయ మార్కెట్లో 7 బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.

7 Best Phones : తగ్గేదేలే.. 2026లో ఐఫోన్ 17 ప్రోకు గట్టి పోటీనిచ్చే 7 బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు.. ఏది కొంటారంటే?

7 Best Phones (Image Credit To Original Source)

Updated On : January 2, 2026 / 10:23 AM IST
  • 2026లో కొనుగోలు చేయగల 7 బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు
  • ఐఫోన్ 17 ప్రో కన్నా అద్భుతమైన ఫీచర్లు
  • 200MP కెమెరాలు, 8K వీడియో రికార్డింగ్ ఆప్షన్ల వరకు

7 Best Phones : 2026లో కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇంతకీ, ఐఫోన్ కొంటారా? ఆండ్రాయిడ్ ఫోన్ కొంటారా? ఏది కొనాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నారా? ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కన్నా అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లో అనేక ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి. 200MP కెమెరా, 8K వీడియో రికార్డింగ్ నుంచి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ పర్ఫార్మెన్స్, భారీ బ్యాటరీలు, అమోల్డ్ డిస్‌ప్లే వరకు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్, షావోమీ 15 అల్ట్రా, రియల్‌మి జీటీ 8 ప్రో వంటి ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఏదైనా కొనేసుకోవచ్చు. మీరు కూడా 2026లో ఐఫోన్ 17 ప్రో రేంజ్ లో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటే మీకోసం 7 బెస్ట్ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాం. అవేంటో ఓసారి లుక్కేయండి.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (రూ. 1,08,890 ) :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 6.9-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ పర్ఫార్మెన్స్, 1TB వరకు స్టోరేజీ అందిస్తుంది. 8K వీడియో, ఇంటర్నల్ S పెన్, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ సపోర్టుతో 200MP క్వాడ్-కెమెరా సిస్టమ్ ఉంది. ఐఫోన్ 17 ప్రో కన్నా బెటరే.

ఒప్పో ఫైండ్ X9 ప్రో (రూ. 1,09,999 ) :
ఒప్పో ఫైండ్ X9 ప్రో ప్రీమియం డిజైన్‌‌తో వస్తుంది. 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, స్పీడ్ యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ ఫ్లాగ్‌షిప్ అందిస్తుంది. 200MP పెరిస్కోప్ లెన్స్ హాసెల్‌బ్లాడ్-ట్యూన్ కెమెరాలు, భారీ 7500mAh బ్యాటరీతో వస్తుంది. ఆపిల్ ప్రో మోడల్ కన్నా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

Read Also : Apple iPhone 16 Price : మెగా డిస్కౌంట్! ఈ ఆపిల్ ఐఫోన్ 16 చాలా చీప్, ఇలా కొన్నారంటే..

గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL (రూ. 1,24,999 ) :
గూగుల్ పిక్సెల్ 10 ప్రో XLలో 6.8-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, టెన్సర్ G5 ప్రాసెసర్ ఉన్నాయి. గూగుల్ కంప్యూటేషనల్ ఇమేజింగ్ పవర్ అందిస్తుంది. 5x పెరిస్కోప్ జూమ్, 42MP 4K సెల్ఫీ కెమెరాతో ట్రిపుల్-కెమెరా సెటప్ కూడా ఉంది. ఐఫోన్ 17 ప్రో కన్నా బెటర్ ఆప్షన్.

వివో X300 ప్రో (రూ. 1,09,999 ) :
వివో X300 ప్రో అనేది కెమెరా ఫస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్. 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ ప్యానెల్, డైమెన్సిటీ 9500 చిప్, 16GB వరకు ర్యామ్ అందిస్తుంది. 8K వీడియోతో భారీ 200MP పెరిస్కోప్ సెన్సార్‌ కూడా ఉంది. 6510mAh బ్యాటరీతో Zeiss ట్యూన్ కెమెరా సిస్టమ్, ఆపిల్ ప్రో ఇమేజింగ్‌కు సపోర్టు చేస్తుంది.

7 Best Phones

7 Best Phones (Image Credit To Original Source)

వన్‌ప్లస్ 15 (రూ. 72,999):
వన్‌ప్లస్ 15 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, మల్టీఫేస్ ట్రిపుల్ 50MP కెమెరా సెటప్‌తో వస్తుంది. 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే కూడా ఉంది. క్లీన్ సాఫ్ట్‌వేర్ స్పీడ్ పర్ఫార్మెన్స్, ఐఫోన్ 17 ప్రో కన్నా బెటర్ ఫోన్ అని చెప్పొచ్చు.

రియల్‌మి జీటీ 8 ప్రో (రూ. 72,999):
రియల్‌మి జీటీ 8 ప్రోలో 6.79-అంగుళాల 144Hz అమోల్డ్ డిస్‌ప్లే, అల్ట్రా-హై బ్రైట్‌నెస్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 పవర్ ఫీచర్లతో పాటు స్టాండ్ అవుట్ 200MP పెరిస్కోప్ కెమెరా కూడా ఉంది. 8K వీడియో సపోర్ట్, భారీ 7000mAh బ్యాటరీ ఉంది.

షావోమీ 15 అల్ట్రా (రూ. 1,09,999 ) :
షావోమీ 15 అల్ట్రా ఫోన్ 1440p రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.73-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే అందిస్తుంది. పవర్‌ఫుల్ 200MP పెరిస్కోప్ లెన్స్ లైకా-ట్యూన్ క్వాడ్-కెమెరా సిస్టమ్ ప్రొఫెషనల్-గ్రేడ్ రిజల్ట్స్ అందిస్తుంది. 2026లో ఐఫోన్ 17 ప్రో కన్నా అద్భుతమైన కెమెరా ఫోన్లలో ఇదొకటిగా చెప్పొచ్చు.