Amazon Great Freedom Sale : అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు.. ఈ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఫుల్ డిటెయిల్స్!
Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ క్రేజీ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
Amazon Great Freedom Sale
- అమెజాన్‌లో రెడ్మి టర్బో 5 ఫోన్ రూ.54,999 నుంచి రూ. 35,999కే లభ్యం
- వన్‌ప్లస్ 13s ఫోన్ రూ. 57,999 నుంచి తగ్గి రూ.49,999కే అమెజాన్‌లో లభ్యం
- వన్‌ప్లస్ N6x ఫోన్ రూ. 26,999 నుంచి రూ.17,499కే లభ్యం కానుంది
Amazon Great Freedom Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 7న ప్రారంభం కానుంది. ఈ స్వాతంత్య్ర దినోత్సవ సేల్‌లో స్మార్ట్ఫోన్ల నుంచి ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్లు, ఇయర్‌బడ్స్, ఇతర యాక్సెసరీల వరకు అన్నింటిపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.
ఈ సేల్కు ముందే, ఈ-కామర్స్ సైట్ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లపై డీల్స్‌తో సహా అనేక (Amazon Great Freedom Sale) ఆఫర్లను వెల్లడించింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా ఈ అద్భుతమైన డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బ్యాంక్ ఆఫర్లు :
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సమయంలో HDFC బ్యాంక్ క్రెడిట్, ఈజీ ఈఎంఐ లావాదేవీలపై 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, అమెజాన్ పే యూపీఐ, ఇతర ప్రీపెయిడ్ మెథడ్స్ అదనంగా రూ. 150 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్లపై 5శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాదు.. మీరు అమెజాన్ పే లేటర్‌తో వడ్డీ లేని పేమెంట్లు కూడా పొందవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో బెస్ట్ డీల్స్ :
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా రెడ్మి టర్బో 5 బ్యాంక్ ఆఫర్లతో రూ. 54,999 నుంచి తగ్గి రూ.35,999కే లభ్యం కానుంది. అలాగే, వన్‌ప్లస్ 13s ఫోన్ రూ. 57,999 నుంచి తగ్గి రూ. 49,999కే లభ్యం కానుంది. షావోమీ 43X 4K గూగుల్ ఎల్ఈడీ టీవీ ధర రూ. 37,999 ఉండగా రూ. 22,249కే లభ్యం కానుంది.
Read Also : Redmi Turbo 5 : గేమింగ్ ఫోన్ కావాలా? ఈ రెడ్మి ఫోన్ అతి చౌకైన ధరకే.. ఇలా కొన్నారంటే?
ఇంటెల్ i7 13వ జెన్ ప్రాసెసర్‌తో లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 రూ. 95వేల నుంచి రూ. 77,990కే లభ్యం కానుంది. వన్‌ప్లస్ N6x ఫోన్ కూడా రూ. 26,999 నుంచి తగ్గి రూ. 17,499కే లభ్యం కానుంది. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలు 50 శాతం నుంచి 80 శాతం తగ్గింపుతో లభిస్తాయి. ఈ సేల్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు వంటి మరెన్నో డీల్స్ సొంతం చేసుకోవచ్చు.
గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో ఐరోప్స్ ప్రైమ్ 800D బోట్ రూ. 4,599 నుంచి తగ్గి రూ. 1,599కే లభ్యం కానుంది. బోట్ లూనార్ డిస్కవరీ రూ. 8,499 నుంచి తగ్గిరూ. 1,460కే లభ్యం అవుతుంది. అమెజాన్ సేల్‌లో హెచ్‌పీ GK400Y గేమింగ్ కీబోర్డ్ రూ. 3,999 నుంచి భారీగా తగ్గి రూ. 1,899కే లభించనుంది.
మొబైల్స్, యాక్సెసరీలపై డిస్కౌంట్లు :
శాంసంగ్ గెలాక్సీ M17 5జీ ఫోన్ సేల్ సమయంలో రూ. 16,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. ఐక్యూ జెడ్1 లైట్ రూ.17,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. రియల్‌మి నార్జో 100x 5జీ ఫోన్ రూ. 19,499 ధరకు అందుబాటులో ఉంటుంది. రెడ్మి A7 ప్రో 5జీ ఫోన్ రూ.14,499 ప్రారంభ ధరతో లభ్యం కానుంది.
