Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ ఫోన్ మోడళ్లపై బెస్ట్ డీల్స్.. తక్కువ ధరకు పొందాలంటే?

Amazon Great Republic Day Sale : ఈ 2025లో స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ కోసం ప్లాన్ చేస్తుంటే.. ప్రీమియం డివైజ్‌లో ఆకర్షణీయమైన డీల్ పొందవచ్చు.

Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ ఫోన్ మోడళ్లపై బెస్ట్ డీల్స్.. తక్కువ ధరకు పొందాలంటే?

Amazon Great Republic Day Sale

Updated On : January 13, 2025 / 4:38 PM IST

Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 ప్రైమ్ మెంబర్‌ల కోసం ఉదయం 12 గంటలకు ప్రారంభమైంది. కానీ, ఇప్పుడు భారతీయ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం మొదటి సేల్ ఈవెంట్ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, అప్లియన్సెస్, ఇతర యూజర్ ఎలక్ట్రానిక్‌లతో సహా అనేక ప్రొడక్టులపై భారీ తగ్గింపులను అందిస్తుంది.

Read Also : Mahakumbh 2025 : మహాకుంభమేళాలో మొదటి రోజు 60 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు.. ఏరియల్ ఫుటేజీలో భారీ జనసందోహం!

మీరు ఈ కొత్త సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ కోసం ప్లాన్ చేస్తుంటే.. ప్రీమియం డివైజ్‌లో ఆకర్షణీయమైన డీల్ పొందవచ్చు. అమెజాన్ అద్భుతమైన అప్‌గ్రేడ్ ఆఫర్ల కోసం కొనుగోలుదారులు ఆపిల్, వన్‌ప్లస్, శాంసంగ్ మరిన్ని బ్రాండ్‌లపై టాప్ ఆఫర్‌ల బెనిఫిట్స్ పొందవచ్చు. సెప్టెంబర్ 2023లో భారత మార్కెట్లో ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయింది. ఈ బేస్ ఐఫోన్ 15 మోడల్ 128జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 69,900కు అందిస్తోంది.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 సందర్భంగా ఈ ఐఫోన్‌ను రూ. 57,499 తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. బ్యాక్ సైడ్ 48ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. ఆపిల్ లైనప్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 13 ఇతర మోడళ్లపై కూడా ఆఫర్‌లు ఉన్నాయి.

Amazon Great Republic Day Sale

Amazon Great Republic Day Sale

అమెజాన్ సేల్ సమయంలో ధర తగ్గింపులతో పాటు సేల్ ధరను వినియోగదారులు కూపన్ తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు లేదా బ్యాంక్ బెనిఫిట్స్ వంటి అదనపు ప్రయోజనాలను పొందవచ్చు . ఇ-కామర్స్ దిగ్గజం 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.

ఎస్బీఐ కార్డ్ లావాదేవీలపై రూ. 14వేలు, పాత ఫోన్లతో గరిష్టంగా రూ. 45వేలు, హ్యాండ్‌సెట్ మోడల్ కండిషన్ బట్టి ఎక్స్ఛేంజ్ వాల్యూను అందిస్తుంది. ఇతర ఆఫర్లలో రూ. 20వేల వరకు కూపన్లు ఉన్నాయి. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Read Also : OnePlus 13R Sale : వన్‌ప్లస్13ఆర్ సేల్ మొదలైంది.. ధర, లాంచ్ ఆఫర్‌లు, స్పెసిఫికేషన్‌లివే..!