Apple iPhone 13 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇంకా చౌకైన ధరకు పొందాలంటే?
Apple iPhone 13 Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 13 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మరిన్ని ఆఫర్ల కోసం పూర్తి వివరాలను తెలుసుకోండి.
![Apple iPhone 13 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇంకా చౌకైన ధరకు పొందాలంటే? Apple iPhone 13 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇంకా చౌకైన ధరకు పొందాలంటే?](https://10tv.in/wp-content/uploads/2024/02/Apple-iPhone-13-receives-12-Percent-discount-on-Amazon.jpg)
Apple iPhone 13 receives 12 Percent discount on Amazon
Apple iPhone 13 Discount : ఆపిల్ ఫోన్ కొంటున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 13 ధర భారీగా తగ్గింది. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ఫ్లాగ్షిప్ ప్రస్తుతం అమెజాన్‌లో ఇర్రెసిస్టిబుల్ డీల్‌తో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ 13 ధర రూ. 52999కు సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా ఈ ఐఫోన్ ధర రూ. 59900 నుంచి ఇప్పుడు తగ్గింది. ఈ ఐఫోన్ మోడల్ 128GB వేరియంట్ ఇప్పుడు 12 శాతం చౌకగా ఉంది. ఐఫోన్ ఔత్సాహికులు ఆపిల్ ఎకో సిస్టంలో చేరడానికి ఇది బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు.
ఈ ఐఫోన్ 13 మోడల్ మొత్తం బ్లూ, పింక్, మిడ్నైట్, స్టార్‌లైట్, గ్రీన్, ప్రొడక్ట్ రెడ్‌తో సహా పవర్ఫుల్ కలర్ రేంజ్లో అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 మోడల్ మాత్రమే కాకుండా అమెజాన్ అదనపు ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఇ-కామర్స్ దిగ్గజం ట్రేడ్-ఇన్ ఆఫర్లతో డీల్‌ను పొందవచ్చు. వినియోగదారులు తమ ప్రస్తుత స్మార్ట్ఫోన్లను రూ. 27వేల వరకు తగ్గింపుతో ఎక్స్ఛేంజ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.
ఐఫోన్ 14 కన్నా ఐఫోన్ 13 బెటర్ ఎందుకంటే? :
ట్రేడ్-ఇన్ విలువ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. కొనుగోలుదారులు వారి స్థానంలో ఆఫర్ లభ్యతను చెక్ చేసేందుకు పిన్ కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఐఫోన్ 13కి అప్‌గ్రేడ్ వెర్షన్ ఐఫోన్ 14కి అనేక తేడాలను కలిగి ఉంది. అదే ఎ15 బయోనిక్ ఎస్ఓసీ, డిస్ప్లేతో పాటు కెమెరాలను కలిగి ఉంది. అదనంగా, మెరుగైన బ్యాటరీ లైఫ్, చిన్న గీతతో సహా గత వెర్షన్ల కన్నా అప్‌గ్రేడ్ ఆప్షన్లతో వస్తుంది. ఐఫోన్ 14ని చూసే వారికి.. ఐఫోన్ 13ని పరిగణనలోకి తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ రెండింటిలో దాదాపు ఒకేలాంటి ఫీచర్లు మరింత సరసమైన ధరకు పొందవచ్చు.
![Apple iPhone 13 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇంకా చౌకైన ధరకు పొందాలంటే? Apple iPhone 13 receives 12 Percent discount on Amazon](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2024/02/Apple-iPhone-13-receives-12-Percent-discount-on-Amazon-1.jpg)
Apple iPhone 13 12 Percent discount
అమెజాన్‌లో తగ్గింపు ఆఫర్ :
ఆపిల్ ఎకో సిస్టంలో ఏకీకృత వినియోగదారు అనుభవాన్ని అందించడంపై దృష్టి సారించింది. ఆపిల్ ప్రపంచంలోకి ప్రవేశించే వారికి ఐఫోన్ 13 అద్భుతమైన ఆప్షన్‌గా పనిచేస్తుంది. అమెజాన్‌లో ఈ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ఆపిల్ ద్వారా అధికారికంగా ఐఫోన్ 13ని తక్కువ ధరకే అందిస్తోంది. ఐఫోన్ 12 కొనుగోలు చేసే వినియోగదారులు ఐఫోన్ 13ని ఎంచుకోవచ్చు. ఈ రెండు ఫోన్లలో దాదాపు ఫీచర్లు ఒకేలా ఉంటాయి.