Apple Devices Sale 2024 : ఈ ఆపిల్ డివైజ్‌లపై రూ. 12వేలు డిస్కౌంట్.. కొత్త ఏడాదిలో సరికొత్త డీల్స్.. డోంట్ మిస్!

Apple Devices Sale : ఆపిల్ ఐఫోన్ 15, ఐప్యాడ్, M3 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ విజయ్ సేల్స్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డీల్స్ ఎలా పొందాలో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Apple Devices Sale 2024 : ఈ ఆపిల్ డివైజ్‌లపై రూ. 12వేలు డిస్కౌంట్.. కొత్త ఏడాదిలో సరికొత్త డీల్స్.. డోంట్ మిస్!

Apple iPhone 15 available at Rs 12,000 discount

Apple Devices Sale : ఆపిల్ సొంత బ్రాండ్ ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పుడు కొనుగోలుదారులు తమకు నచ్చిన డివైజ్ కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. గత ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 15 సెప్టెంబర్ 12న ఆపిల్ వండర్లస్ట్ ఈవెంట్ సందర్భంగా ఆవిష్కరించింది. అధికారికంగా సెప్టెంబర్ 22న ఢిల్లీ స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది.

Read Also :  Apple iPhone 15 Price Cut : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ తగ్గింపు.. కొత్త ధర, బ్యాంకు ఆఫర్లు ఇవే..!

లాంచ్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 15 128జీబీ వేరియంట్ ధర రూ.79,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.89,900గా ఉంది. 512జీబీ వేరియంట్ రూ. 1,09,900కు అందుబాటులో ఉంది. ఐఫోన్ 14తో పోల్చినప్పుడు.. ఈ ఫోన్ పెద్ద అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఇప్పుడు, విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్‌లో భాగంగా సరికొత్త ఐఫోన్‌ను భారీ తగ్గింపుతో అందిస్తోంది. ఈ కొత్తఆఫర్ జనవరి 7 వరకు అందుబాటులో ఉంటుంది. మీరు 130 స్టోర్‌లలో లేదా వారి వెబ్‌సైట్‌లో ఈ డీల్‌లను పొందవచ్చు. ఐప్యాడ్, మ్యాక్‌బుక్ ప్రో వివిధ మోడళ్లపై డీల్స్ కూడా అందిస్తోంది.

ఐఫోన్ 15పై విజయ్ సేల్స్ ఆఫర్ :
ఆపిల్ ఐఫోన్ 15 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు విజయ్ సేల్స్‌లో రూ.70,990కి అందుబాటులో ఉంది. దీనితో పాటు, ఈ ఐఫోన్ మొత్తం ధరను మరింత తగ్గించడంలో సాయపడే అనేక ఆఫర్లు ఉన్నాయి. ఉదాహరణకు.. మీరు హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌ని కలిగి ఉంటే.. మీరు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ. 4వేల వరకు పొందవచ్చు.

అందువల్ల, మొత్తం తగ్గింపు దాదాపు రూ. 12వేలు ఉంటుంది. ఇతర బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, 1టీబీ స్టోరేజ్‌తో కూడిన ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,62,990 లేదా బ్యాంక్ ఆఫర్‌తో రూ. 1,59,990కి లభిస్తుంది. ఐఫోన్ 15 ప్రో ఇతర వెర్షన్లు కూడా డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి.

Apple iPhone 15 available at Rs 12,000 discount

Apple iPhone 15 discount

ఇతర డీల్స్ మీకోసం :
ఐప్యాడ్ మోడల్‌లు, మ్యాక్‌బుక్ ప్రో, కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ 9, ఎయిర్‌పాడ్స్ ప్రో 2వ జెన్‌పై కూడా డీల్‌లు ఉన్నాయి. ఐప్యాడ్ 9వ జనరేషన్ ప్రారంభ ధర రూ. 27,900కు పొందవచ్చు. ఐప్యాడ్ 10వ జనరేషన్ ప్రారంభ ధర రూ. 33,430, ఐప్యాడ్ ఎయిర్ 5వ జనరేషన్ ప్రారంభ ధర రూ. 50,680, ఐప్యాడ్ ప్రో ప్రారంభ ధర రూ. 79,900, ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్లు రూ. 4వేల వరకు తగ్గుతాయి.

ల్యాప్‌టాప్‌ల విషయానికి వస్తే.. ఎం3 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ ధర రూ. 1,47,910, ఎం3 ప్రో చిప్‌ ధర రూ. 1,74,910 నుంచి ఎం3 మ్యాక్స్ చిప్ మోడల్ రూ. 2,82,910, ఎం2 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రో ధర రూ. 1,10,270 వద్ద అందుబాటులో ఉంది. అన్నీ డివైజ్‌లు హెచ్‌‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లతో ఫ్లాట్ డిస్కౌంట్ రూ. 5వేల వరకు పొందవచ్చు.

స్మార్ట్‌వాచ్‌లలో ఆపిల్ వాచ్ సిరీస్ 9 ప్రారంభ ధర రూ. 36,310 ఉండగా, ఆపిల్ వాచ్ ఎస్ఈ (2వ జనరేషన్) రూ. 25,690, ఆపిల్ వాచ్ సిరీస్ 8 ప్రారంభ ధర రూ. 32,620, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లతో గరిష్టంగా రూ. 2,500 తగ్గింపుతో పొందవచ్చు. మీరు ఇయర్‌బడ్‌ల కోసం చూస్తుంటే.. ఎయిర్‌పాడ్స్ ప్రో (2వ తరం) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ సహా రూ. 18,990కు పొందవచ్చు.

Read Also : Apple iPhone 15 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై బిగ్ డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?