Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై న్యూ ఇయర్ డిస్కౌంట్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధర ఎంతంటే?
Apple iPhone 15 : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఈ న్యూ ఇయర డీల్ ఎలా పొందాలంటే..

Apple iPhone 15 New Year discount offer goes live
Apple iPhone 15 Discount Offer : కొత్త ఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 15 న్యూ ఇయర్ డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 69,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 రూ. 73,999 ప్రారంభ ధరతో పొందవచ్చు. ప్రస్తుతానికి అత్యంత తక్కువ ధరగా చెప్పవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి చెల్లింపు చేస్తే వినియోగదారులు రూ.69,999 ప్రభావవంతమైన ధరతో పొందవచ్చు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ న్యూ ఇయర్ 2024 డిస్కౌంట్ ఆఫర్‌లో భాగంగా ఐఫోన్ 15ని సాధ్యమైనంత తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం లేటెస్ట్ ఐఫోన్‌పై ఫ్లాట్ డిస్కౌంట్, ఇతర ఆఫర్‌లను కూడా అందిస్తోంది. దీని ధర రూ.69,999కి తగ్గింది. మీరు ఐఫోన్ 15ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును అందిస్తునడానికి ఇదే బెస్ట్ టైమ్. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.
ఐఫోన్ 15 న్యూ ఇయర్ 2024 డిస్కౌంట్ ఆఫర్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 రూ. 73,999 ధరకు కొనుగోలు చేయొచ్చు.ఆపిల్ భారత మార్కెట్లో ఈ ఐఫోన్‌ను రూ. 79,999కి ప్రకటించింది. అంటే.. ఒకరికి రూ. 6వేల డిస్కౌంట్ లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 4వేల అదనపు తగ్గింపు ఆఫర్ కూడా అందిస్తోంది. మీకు కార్డ్ ఉంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 69,999 ధరను తగ్గిస్తుంది.

Apple iPhone 15 New Year discount
ఫ్లిప్‌కార్ట్ మొబైల్ వెర్షన్‌లో కూడా ఆఫర్ కనిపిస్తుంది. వినియోగదారులు ఐఫోన్ 15ని చాలా తక్కువ ధరకు పొందడానికి ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ రూ.37,500 వరకు ఇస్తోంది. కానీ, ప్లాట్‌ఫారమ్ పూర్తి డిస్కౌంట్ ఆఫర్‌ను పొందలేమని గుర్తుంచుకోండి. మీ ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ మొత్తం పొందవచ్చు.
2024లో కొనుగోలు చేయాలా వద్దా? :
కొత్త ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలా? రూ.70వేలు ఖర్చు చేసేవారికి ఇదే బెస్ట్ ఆప్షన్. ఈ కొత్త మోడల్‌లో ప్రకాశవంతమైన డిస్‌ప్లే కూడా ఉంది. వినియోగదారులు ఒక రోజు కన్నా తక్కువ బ్యాటరీ లైఫ్ పొందుతారని ఆపిల్ చెబుతోంది. 4కె సినిమాటిక్ మోడ్, వేగవంతమైన చిప్‌సెట్, కొత్త పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్, యూఎస్‌బీ-సి పోర్ట్‌కు సపోర్టుతో మంచి 48ఎంపీ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది.
యూఎస్‌బీ-సి పోర్ట్ ద్వారా మీరు ఐఫోన్ 15 ప్రత్యేక ఛార్జింగ్ కేబుల్‌తో పాటు అడాప్టర్‌ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఏదైనా టైప్-సి ఛార్జర్‌ని ఉపయోగించవచ్చు. ఈ డివైజ్ వైర్‌లెస్ ఛార్జింగ్, ఐపీ68 రేటింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఐఫోన్ 15 బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. గత వెర్షన్లతో పోలిస్తే.. మెరుగైన ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు.
Read Also : Apple iPhone 15 Price Cut : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ తగ్గింపు.. కొత్త ధర, బ్యాంకు ఆఫర్లు ఇవే..!