iPhone 16 : బిగ్ డిస్కౌంట్.. రూ.80వేల ఐఫోన్ 16 కేవలం రూ.44వేలకే.. ఇంత తక్కువలో మళ్లీ దొరకదు!
iPhone 16 : కొత్త ఆపిల్ ఐఫోన్ 16 కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ధర కేవలం రూ. 44వేల ధరలో కొనుగోలు చేయొచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16 Get Discount
iPhone 16 : మీరు ఆపిల్ ఐఫోన్ ప్రియులైతే మీకో గుడ్ న్యూస్.. ప్రస్తుతం ఐఫోన్ 16పై అద్బుతమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్ భారీ తగ్గింపును పొందింది. ఇప్పుడు మీరు కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. మళ్లీ ఈ డిస్కౌంట్ రాకపోవచ్చు.
చాలా కాలంగా ఐఫోన్ 16 కొనాలని చూస్తుంటే ఇదే గోల్డెన్ చాన్స్. మీరు ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ, ఐఫోన్ 16 తక్కువ ధరకే ఎలా పొందాలి? బ్యాంకు ఆఫర్లు ఏంటి? ఇంకా ఏయే ఆఫర్లు ఉన్నాయి? ఎక్కడ కొనాలి? ఎలా కొనాలి? ఐఫోన్ 16 ధర సగానికి సగం రేటుకే రావాలంటే ఏమి చేయాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్ :
ఆపిల్ ఐఫోన్ 16పై రూ.5వేలు డిస్కౌంట్ లభిస్తుంది. ఐఫోన్ 16 ధర 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900 నుంచి ప్రారంభమవుతుంది. కానీ, మీరు 6 శాతం తగ్గింపుతో రూ.74,900కు కొనుగోలు చేయవచ్చు. అంటే.. మీకు రూ.5వేలు తగ్గింపు లభిస్తుంది.
ఐఫోన్ 16 ఎలా కొనాలి? :
మీరు ఐఫోన్ 16పై రూ. 5వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే, మీరు ఈ ఐఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు. ఇలాంటి పరిస్థితిలో మీరు ఐఫోన్ 16 ధరపై దాదాపు రూ. 44వేలు తగ్గింపు పొందవచ్చు. మీకు రూ. 5వేలు డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే, రూ. 39,150 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. కానీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి గమనించాలి. అప్పుడే మీరు ఐఫోన్ 16 రూ. 44,150 ధరకు పొందవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు ఇవే :
బ్యాంక్ ఆఫర్ కింద మీరు ఐఫోన్ 16పై (Flipkart Axis) బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం తగ్గింపు పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు రూ. 4వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంతేకాదు.. మీరు SBI, Kotak బ్యాంక్ కార్డులపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.