Apple iPhone 16 Price : ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!
Apple iPhone 16 Price : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సందర్భంగా ఐఫోన్ 16 అసలు ధర కన్నా భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది. ఈ డీల్ మీకోసమే..

Apple iPhone 16 Price
Apple iPhone 16 Price : ఆపిల్ ఐఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ అధికారికంగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యుల అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 11 నుంచి ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లందరికి ఈ పండగ సేల్ అందుబాటులో ఉంటుంది.
ప్రతి ఏడాది మాదిరిగానే ఐఫోన్‌లు ఈసారి భారీ తగ్గింపుతో (Apple iPhone 16 Price) లభ్యమవుతున్నాయి. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో A18 చిప్ కలిగి ఉంది. ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 16 ఇప్పుడు రూ. 20వేల కన్నా ఎక్కువ తగ్గింపు పొందవచ్చు. ఈ సీజన్‌లో అత్యంత హాటెస్ట్ డీల్‌లలో ఇదొకటిగా చెప్పొచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింపు :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ధర రూ.79,900కు లాంచ్ కాగా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.62,999కి లిస్ట్ అయింది. అంటే.. రూ.13వేలు భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కస్టమర్‌లు రూ.3,149 అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు, దాంతో ఐఫోన్ 16 ధర కేవలం రూ.59,850కి లభిస్తుంది.
లాంచ్ ధరతో పోలిస్తే కొనుగోలుదారులు మొత్తం రూ.20వేలు కన్నా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కూడా అందిస్తోంది. దాంతో ఆసక్తిగల వినియోగదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లపై ట్రేడింగ్ ద్వారా ఎక్కువ సేవింగ్ చేసుకోవచ్చు. పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి ఫైనల్ ధర తగ్గింపు ఉంటుంది.
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. హుడ్ కింద, ఆపిల్ A18 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. iOS 18తో వస్తుంది. కంపెనీ కొత్త ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో అద్భుతమైన పర్ఫార్మెన్స్, సపోర్టును తెస్తుంది. బేస్ వేరియంట్‌లో 8GB ర్యామ్, 128GB స్టోరేజీ ఉన్నాయి.
ఐఫోన్ 16 మోడల్ మొత్తం అల్ట్రామెరైన్, టీల్, బ్లాక్, వైట్, పింక్ అనే 5 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. అయితే, 12MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలతో వస్తుంది. బ్యాటరీ పరంగా ఐఫోన్ 16 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 3561mAh బ్యాటరీని కలిగి ఉంది.