Labour Day Holiday : మే 1న బ్యాంకులకు సెలవు ఉందా? తెరిచే ఉంటాయా? ఆర్బీఐ ఏం చెప్పిందంటే? ఫుల్ డిటెయిల్స్..!
Labour Day Holiday : మే1వ తేదీన బ్యాంకులు పనిచేయవు. కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున బ్యాంకులు మూతపడతాయి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. మే 1వ తేదీన ఆర్బీఐ ఎందుకు సెలవు ప్రకటించిందో చూద్దాం..
Labour Day Holiday
- మే 1వ తేదీన కార్మిక దినోత్సవం
- ఈ రోజున బ్యాంకులు మూతపడతాయా? లేదా తెరిచే ఉంటాయా?
- దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చాలా బ్యాంకులు మూతపడతాయి
- స్టాక్ మార్కెట్ కూడా మే నెల మొదటి రోజున పనిచేయవు
Labour Day Holiday : మీకు బ్యాంకులో పని ఉందా? మే 1వ (శుక్రవారం) తేదీన బ్యాంకులకు సెలువులు. మే నెల మొదటి రోజున దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. స్టాక్ మార్కెట్ కూడా ఉండదు. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ట్రేడింగ్ జరగదు. ఆర్బీఐ మే 1వ తేదీన ఎందుకు సెలవు ప్రకటించిందో ఇప్పుడు తెలుసుకుందాం..
మే 1 తేదీన బ్యాంకులకు సెలవులు :
బుద్ధ పౌర్ణమి, కార్మిక దినోత్సవం కారణంగా 2026, మే 1వ తేదీ, శుక్రవారం రోజున బ్యాంకులు మూతపడతాయి. అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకు శాఖలన్నీ పనిచేయవు. ఈ సెలవు రోజున కస్టమర్లకు యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి.
బుద్ధ పౌర్ణమి, కార్మిక దినోత్సవం (మే డే) ఒకటో తేదీన వస్తాయి. బుద్ధ పౌర్ణమిని గౌతమ బుద్ధ భగవానుని జననం సందర్భంగా ఈ రోజు పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. అదే సమయంలో, కార్మికుల కృషిని వారి హక్కులను గౌరవించేందుకు ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1960లో బొంబాయి రాష్ట్ర విభజన తర్వాత మహారాష్ట్ర రాష్ట్రం మే 1వ తేదీన ఏర్పడింది. అప్పటినుంచి మహారాష్ట్ర దినోత్సవాన్ని ఇదే రోజన జరుపుకుంటారు.
Read Also : Moto G87 Launch : 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో కొత్త మోటో G87 ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
ఈ సమయంలో పండిట్ రఘునాథ్ ముర్ము జయంతిని కూడా జరుపుకుంటారు. ఆయన సంతాలి భాష కోసం ఓల్-చికీ లిపిని క్రియేట్ చేశారు. గిరిజన వర్గాల భాష, సంస్కృతి పరిరక్షణకు ఎంతో కృషి చేశారు. ఈ కారణంగానే అనేక రాష్ట్రాల్లో ఈ రోజున బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు మూసి ఉంటాయి.
మే 2026లో బ్యాంకు సెలవులివే :
మే 1 (శుక్రవారం) రోజున మహారాష్ట్ర దినోత్సవం, బుద్ధ పౌర్ణమి, మే డే, కార్మిక దినోత్సవం, పండిట్ రఘునాథ్ ముర్ము గారి పుట్టినరోజు కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో :
పండగల సమయంలో బ్యాంకు శాఖలు మూతపడతాయి. చెక్కుల క్లియరెన్స్, క్యాష్ డిపాజిట్లు, విత్డ్రాయల్స్ జరగవు. పాస్బుక్లు అప్డేట్ కావు. ఇతర పనులను ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నిర్వహించుకోవచ్చు.
మీకు బ్యాంకుకు సంబంధించిన ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్లాన్ చేసుకోండి. మే 1న స్టాక్ మార్కెట్ కూడా మూతపడుతుంది. మే నెలలో స్టాక్ మార్కెట్లు (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ) కూడా మూతపడతాయి.
మే 1వ తేదీ : మహారాష్ట్ర దినోత్సవం
మే 28 : బక్రీద్
