Amazon Early Deals 2025 : అమెజాన్ పండగ సేల్ ఆఫర్లు.. రూ. 30వేల లోపు బెస్ట్ 50 అంగుళాల స్మార్ట్‌టీవీలు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Amazon Early Deals 2025 : అమెజాన్ ఎర్లీ డీల్స్ 2025 సేల్ సందర్భంగా అతి తక్కువ ధరకే 50 అంగుళాల స్మార్ట్ టీవీలు లభ్యమవుతున్నాయి. ఈ అద్భుతమైన డీల్స్ ఎలా పొందాలంటే?

Amazon Early Deals 2025 : మీరు కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? తక్కువ బడ్జెట్‌లో కొత్త టీవీ ఇంటికి తెచ్చుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడంతో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా తగ్గాయి. అమెజాన్ డీల్స్ 50-అంగుళాల స్మార్ట్ టీవీలను కూడా అతి తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. 4K అల్ట్రా HD క్వాలిటీతో రూ. 30వేలు కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం 3 అద్భుతమైన స్మార్ట్‌టీవీలను క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో కొనుగోలు చేయవచ్చు. ధరల వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

VW (50 అంగుళాలు) ప్రో సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ QLED గూగుల్ టీవీ : విడబ్ల్యూ నుంచి వచ్చిన ఈ 50-అంగుళాల స్మార్ట్ టీవీ అమెజాన్ నుంచి రూ.24,999 కొనుగోలుకు అందుబాటులో ఉంది. రూ.1,249 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. మీరు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో కూడా కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. ఏఐ పిక్చర్ అప్‌గ్రేడ్ కలిగి ఉంది. సౌండ్ అవుట్‌పుట్, డాల్బీ ఆడియో క్వాలిటీతో వస్తుంది. 2GB ర్యామ్, 16GB స్టోరేజీతో వస్తుంది.

తోషిబా (50 అంగుళాలు) సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ QLED టీవీ : ఈ తోషిబా టీవీ 50-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది. అమెజాన్ నుంచి రూ.28,999కి కొనేసుకోవచ్చు. మీరు రూ. 1,449 క్యాష్‌బ్యాక్‌తో పొందవచ్చు.

ఈ టీవీని నో-కాస్ట్ ఈఎంఐతో కూడా కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల పరంగా పరిశీలిస్తే.. ఈ టీవీలో 4K అల్ట్రా HD QLED డిస్‌ప్లే ఉంది. డాల్బీ అట్మాస్‌తో 24W సౌండ్ అవుట్‌పుట్, 3 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు కూడా కలిగి ఉంది.

వెస్టింగ్‌హౌస్ (50 అంగుళాలు) క్వాంటం సిరీస్ 4K అల్ట్రా HD LED గూగుల్ టీవీ : ఈ వెస్టింగ్‌హౌస్ స్మార్ట్ టీవీ 50-అంగుళాల సైజులో వస్తుంది. అమెజాన్ నుంచి రూ.26,499కి కొనుగోలు చేయవచ్చు. రూ. 1,324 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఈ టీవీని కొనుగోలు చేశాక కస్టమర్‌లు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. ఫీచర్ల పరంగా ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్, 4K అల్ట్రా HD డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్, 48-వాట్ సౌండ్ అవుట్‌పుట్ కలిగి ఉంది.