Best Mobile Phones : ఈ ఆగస్టులో రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Best Mobile Phones : ఈ రియల్‌మి 12 5జీ ఫోన్ పంచ్ ప్యాక్ చేసే బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో బ్రౌజింగ్, సోషల్ మీడియా, లైట్ గేమింగ్ వంటి రోజువారీ పనులకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

Best Mobile Phones : ఈ ఆగస్టులో రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Best Mobile Phones under Rs 15k in August 2024 ( Image Source : Google )

Best Mobile Phones : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో రూ. 15వేల లోపు కొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ప్రాసెసర్‌, లైఫ్ లాంగ్ బ్యాటరీ, కెమెరాలతో కొన్ని స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో కొనుగోలు చేయొచ్చు. గేమింగ్ కోసం ఫోన్ కావాలన్నా, వీడియోలు చూడాలన్నా, ఫొటోలు తీయాలన్నా, ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి సొంతం చేసుకోవచ్చు.

ఈ ఆగస్టులో మీరు రూ. 15వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ 5జీ ఫోన్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో రియల్‌మి 12 5జీ, రెడ్‌మి 13 5జీ, మోటోరోలా జీ64 5జీ, లావా స్టార్మ్ 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏ 5జీ ఫోన్ కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : iPhone 17 Series : బిగ్ కెమెరా అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. లేటెస్ట్ లీక్ ఇదిగో..!

రియల్‌మి 12 5జీ :
ఈ రియల్‌మి 12 5జీ ఫోన్ పంచ్ ప్యాక్ చేసే బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో బ్రౌజింగ్, సోషల్ మీడియా, లైట్ గేమింగ్ వంటి రోజువారీ పనులకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ లాంగ్ లైఫ్ పవర్ అందిస్తుంది. 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ గంటలోపు బ్యాకప్ అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఐపీఎస్ స్క్రీన్ గేమింగ్, వీడియోలు, నావిగేషన్ కోసం వినియోగించుకోవచ్చు.

రెడ్‌మి 13 5జీ :
ఈ జాబితాలోని మరో ఫోన్ రెడ్‌మి 13 5జీ, రెడ్‌మి 12 5జీకి అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోన్ కీలకమైన ఫీచర్లను కలిగి ఉంది. డిస్‌ప్లే ఇప్పుడు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కెమెరా సిస్టమ్ 108ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. బ్యాటరీ సామర్థ్యం అలాగే ఉంటుంది. అయితే, ఛార్జింగ్ స్పీడ్, ఇన్-బాక్స్ ఛార్జర్ 33 డబ్ల్యూకి అప్‌గ్రేడ్ అయింది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఆండ్రాయిడ్ 14లో హైపర్ఓఎస్ సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది.

మోటోరోలా జీ64 5జీ :
మోటోరోలా జీ64 5జీ అనేది ఈ ధర పరిధిలో మరో అద్భుతమైన ఫీచర్-రిచ్ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ఎస్ఓసీ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. రోజువారీ ఉపయోగం, తేలికపాటి గేమింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. 8జీబీ ర్యామ్ ప్లస్, 128జీబీ లేదా 12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ రెండు స్టోరేజ్ ఆప్షన్‌ల మధ్య ఎంచుకోవచ్చు. ఓఐఎస్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా ఆకట్టుకునే ఫొటో క్వాలిటీని అందిస్తుంది. క్లీన్ ఆండ్రాయిడ్ 14 బ్లోట్‌వేర్-రహిత యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. మోటోరోలా జీ64 5జీ అద్భుతమైన బ్యాటరీ లైఫ్, 6,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.

లావా స్టార్మ్ 5జీ :
లావా స్టార్మ్ 5జీ ఫోన్ సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. గేమింగ్, వీడియోలకు అద్భుతంగా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్ఓసీ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. 5,000mAh బ్యాటరీ లాంగ్ టైమ్ పవర్ అందిస్తుంది. 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ బూస్ట్‌ను అందిస్తుంది. కెమెరా మంచి లైటింగ్‌లో బాగా పనిచేస్తుంది. రోజువారీ ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంటుంది.

Read Also : iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ చూశారా? కొత్త డిజైన్ అదుర్స్.. అధికారిక ఫొటో లీక్.. ఫీచర్లు ఇవేనా?