Blaupunkt QLED Smart TV : ఇంట్లోనే థియేటర్ ఫీల్.. సరసమైన ధరలో కొత్త QLED స్మార్ట్‌టీవీలు వచ్చేశాయ్..!

Blaupunkt QLED Smart TV : బ్లాపంక్ట్ కంపెనీ భారత మార్కెట్లో కొత్త QLED స్మార్ట్ టీవీ సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో గూగుల్ టీవీ 5.0, 48W సౌండ్ క్యూఎల్ఈడీ డిస్‌ప్లే ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీ ధరలు రూ. 11,499 నుంచి అందుబాటులో ఉన్నాయి.

Blaupunkt QLED Smart TV ( Image Credit : AI )

  • బ్లాపంక్ట్ నుంచి భారత మార్కెట్లోకి కొత్త QLED స్మార్ట్ టీవీ సిరీస్‌
  • ఈ స్మార్ట్ టీవీల ప్రారంభ ధర కేవలం రూ. 11,499 మాత్రమే
  • 32, 40, 43-అంగుళాల స్క్రీన్ సైజులలో అందుబాటులో

Blaupunkt QLED Smart TV : కొత్త స్మార్ట్ టీవీ కొనేవారికి గుడ్ న్యూస్.. కొత్త క్యూఎల్ఈడీ టెక్నాలజీతో సరికొత్త స్మార్ట్ టీవీలు భారత మార్కెట్లోకి వచ్చేశాయి. జర్మన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బ్లాపంక్ట్ కొత్త క్యూలెడ్ స్మార్ట్ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీల ప్రారంభ ధర కేవలం రూ. 11,499 నుంచి లభ్యమవుతున్నాయి.

అత్యంత సరసమైన ధరలో బ్లాపంక్ట్ స్మార్ట్ టీవీలు వరుసగా 32, 40, 43-అంగుళాల స్క్రీన్ సైజులలో (Blaupunkt QLED Smart TV) అందుబాటులో ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీలు గూగుల్ టీవీ 5.0 ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతాయి. 48W పవర్‌ఫుల్ సౌండ్, క్యూలెడ్ డిస్‌ప్లే, 10వేలకు పైగా యాప్‌లకు సపోర్ట్‌ అందిస్తుంది. తక్కువ ధరకే ప్రీమియం ఎంటర్ టైన్మెంట్ కోరుకునే యూజర్ల కోసం ఈ సిరీస్‌ను తీసుకొచ్చినట్టు కంపెనీ చెబుతోంది.

ధర, లభ్యత ఎక్కడంటే? :
భారత మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా బ్లాపంక్ట్ కొత్త క్యూలెడ్ స్మార్ట్ టీవీ సిరీస్ అమ్మకానికి అందుబాటులో ఉంది. 32-అంగుళాల మోడల్ ధర రూ. 11,499 కాగా, 40-అంగుళాల మోడల్ ధరలు వరుసగా రూ. 16,499, రూ. 17,499గా ఉన్నాయి.

గూగుల్ టీవీ 5.0 క్యూలెడ్ డిస్‌ప్లే :
కొత్త బ్లాపంక్ట్ క్యూఎల్‌ఈడీ టీవీ సిరీస్ గూగుల్ టీవీ 5.0 ప్లాట్‌ఫామ్‌తో వస్తుంది. వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జియో హాట్‌స్టార్ అనేక ఇతర ప్లాట్‌ఫామ్‌ల నుంచి కంటెంట్‌ను ఒకే చోట స్ట్రీమ్ చేయవచ్చు.

Read Also : Airtel Cheapest Plan : ఎయిర్‌టెల్ చీపెస్ట్ ప్లాన్ అదుర్స్.. ఒక్క రీఛార్జ్‌తో ఏడాదంతా ఫుల్ ఎంజాయ్!

10,000కుపైగా యాప్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ టీవీలు క్వాంటం డాట్ క్యూఎల్‌ఈడీ టెక్నాలజీతో వస్తాయి. ఫుల్ బ్రైట్ నెస్, క్లియర్ కలర్స్, స్ట్రాంగ్ కాంట్రాస్ట్‌ అందిస్తుంది. బెజెల్-లెస్ డిజైన్‌ కూడా ఉంది. ఈ క్యూఎల్ఈడీ టీవీ సిరీస్‌లో ARM కార్టెక్స్ A55 క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఉంది. 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ యాప్‌లు ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. కొత్త యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మిరాకాస్ట్, ఫాస్ట్ బూట్, హోటల్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. రోజువారీ ఎంటర్ టైన్మెంట్ ఆన్‌లైన్ కంటెంట్, స్మార్ట్ ఫీచర్ల కోసం ఈ టీవీని ఇంటికి తెచ్చుకోవచ్చు.

పవర్‌ఫుల్ సౌండ్, స్మార్ట్ ఫీచర్లు
బ్లాపంక్ట్ బ్రాండ్ కొత్త క్యూఎల్ఈడీ టీవీ సిరీస్‌లో డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్‌తో 48W బాక్స్ స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీలు గేమ్ మోడ్, మూవీ మోడ్, స్పోర్ట్స్ మోడ్, డైనమిక్ మోడ్ వంటి కస్టమైజడ్ పిక్చర్ సెట్టింగ్‌ అందిస్తాయి.

కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 5.0, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, 3 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. తద్వారా యూజర్లు తమ వాయిస్ కమాండ్‌లతో కంటెంట్‌ను సెర్చ్ చేయొచ్చు. స్మార్ట్ డివైజ్‌లను కూడా కంట్రోల్ చేయొచ్చు.