Car discounts June 2026 : జూన్ మెగా సేల్.. హ్యుందాయ్ నుంచి టాటా వరకు.. ఈ పాపులర్ కార్లపై రూ.2.15 లక్షల వరకు తగ్గింపు..
Car discounts June 2026 : జూన్ 2026లో ఎంపిక చేసిన అనేక కార్ల మోడళ్లపై హ్యుందాయ్, మారుతి సుజుకి , టాటా మోటార్స్ భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లతో మొత్తంగా రూ. 2.15 లక్షల వరకు ఆదా చేయొచ్చు.
Car discounts June 2026
- ఈ జూన్ నెలలో పాపులర్ కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లు
- హ్యుందాయ్ నుంచి టాటా మోటార్స్ వరకు మరెన్నో బెనిఫిట్స్
- ఎంపిక చేసిన అన్ని మోడల్ కార్లపై రూ. 2.15 లక్షల వరకు ఆదా
Car discounts June 2026 : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ జూన్ నెలలో కొత్త కారు కొనేవారికి అద్భుతమైన ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం హ్యుందాయ్, మారుతి సుజుకి, టాటా మోటార్స్‌తో సహా పాపులర్ కార్లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
జూన్ 2026 ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ప్రోత్సాహకాలు, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఎంపిక చేసిన కారు మోడళ్లపై మొత్తం రూ. 2.15 లక్షల వరకు సేవింగ్ చేసుకోవచ్చు. పూర్తి ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.
హ్యుందాయ్ డిస్కౌంట్లు :
హ్యుందాయ్ అనేక పాపులర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ లిస్టులో క్రెటా SUV టాప్ ప్లేసులో ఉంది. నివేదిక ప్రకారం.. ఎంపిక చేసిన క్రెటా పెట్రోల్ వేరియంట్లపై రూ. 1 లక్ష వరకు ఆదా చేయొచ్చు.
అదే సమయంలో, వెర్నా ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లపై రూ. 95వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. అప్డేటెడ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్‌పై రూ. 55వేల వరకు విలువైన ఆఫర్లు ఉన్నాయి. క్రెటా ఎలక్ట్రిక్ కారుపై రూ. 85వేల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.
- గ్రాండ్ i10 నియోస్ : రూ. 78 వేల వరకు బెనిఫిట్స్
- అల్కాజర్ : రూ. 75వేల వరకు ఆదా
- i20, i20 ఎన్ లైన్ : రూ. 63వేల వరకు బెనిఫిట్స్
- ఎక్స్టర్ : రూ. 43వేల వరకు విలువైన డిస్కౌంట్లు
- ఆరా : రూ. 25వేల వరకు బెనిఫిట్స్
- వెన్యూ : రూ. 5వేల వరకు స్క్రాపేజ్ బెనిఫిట్స్
మారుతి సుజుకి డిస్కౌంట్లు :
ఈ జూన్ నెలలో మారుతి సుజుకి నెక్సా లైనప్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఇందులో ఇన్విక్టో ఎంపీవీ రూ. 2.15 లక్షల వరకు మొత్తం బెనిఫిట్స్‌తో టాప్ ప్లేసులో నిలిచింది.
Read Also : OnePlus 11 5G : వావ్! ఈ వన్‌ప్లస్ 5G ఫోన్ చీపెస్ట్ ధరలో.. ఏకంగా రూ.20వేలు తగ్గింపు!
గ్రాండ్ విటారా ఎస్యూవీ పెట్రోల్ వేరియంట్లపై రూ. 85వేల నుంచి రూ. 1.35 లక్షల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్లకు ఢిల్లీలో అదనపు రోడ్-ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఎక్స్టెండెడ్ వారంటీ ప్యాకేజీలతో పాటు మొత్తం ఆదా రూ. 1.85 లక్షల వరకు ఉంటుంది.
- ఇగ్నిస్ : రూ. 45వేల వరకు బెనిఫిట్స్
- బాలెనో : రూ. 40వేల వరకు డిస్కౌంట్లు
- XL6 : రూ. 45వేల వరకు బెనిఫిట్స్
- జిమ్నీ: రూ. 45వేల వరకు సేవింగ్
- ఫ్రాంక్స్ : వేరియంట్ బట్టి రూ. 25వేల వరకు తగ్గింపు
ఈ ఆఫర్లలో ఎక్కువగా ఎక్స్చేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ఇన్సింటివ్స్, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి.
టాటా మోటార్స్ జూన్ 2026 డిస్కౌంట్లు :
టాటా మోటార్స్ జూన్ నెల మొత్తం పలు ప్యాసింజర్ కార్లపై రూ. 55వేల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్లు పంచ్ అప్డేటెడ్ టియాగో ఫేస్‌లిఫ్ట్ మినహా చాలా వరకు 2026 మోడల్ ఇయర్ కార్లు ఎస్‌యూవీలకు వర్తిస్తాయి.
అత్యధిక తగ్గింపులు ఇవే :
- టాటా నెక్సాన్ : రూ. 55వేల వరకు బెనిఫిట్స్
- టాటా కర్వ్ : రూ. 55వేల వరకు బెనిఫిట్స్
- డీజిల్ పవర్డ్ హారియర్ సఫారీ SUVలలో ఒక్కొక్కదానిపై రూ. 45వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.
అదనపు డిస్కౌంట్లు ఇవే :
- టాటా ఆల్ట్రోజ్: రూ. 40వేల వరకు
- టాటా టియాగో (ప్రీ-ఫేస్‌లిఫ్ట్) : రూ. 35వేల వరకు
- టాటా టిగోర్ : రూ. 30వేల వరకు
ఈ కార్లపై ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, కార్పొరేట్ ఇన్సింటివ్స్ వంటివి ఉంటాయి.
అత్యధిక డిస్కౌంట్లు :
- మారుతి సుజుకి ఇన్విక్టో : రూ. 2.15 లక్షల వరకు
- హ్యుందాయ్ అతిపెద్ద ఆఫర్ : క్రెటా : రూ. 1 లక్ష వరకు
- టాటా అతిపెద్ద ఆఫర్ : నెక్సాన్ కర్వ్వి : రూ. 55వేల వరకు
ఈ ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. బెనిఫిట్స్ సిటీ, డీలర్షిప్ స్టాక్ వేరియంట్ లభ్యతను బట్టి మారవచ్చు. మీ ప్రాంతం లభ్యతను బట్టి డిస్కౌంట్లు, బెనిఫిట్స్ మారుతాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు ఆఫర్ల వివరాల కోసం సమీపంలోని డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.
