Croma Apple Sale : ఆపిల్ ఫ్యాన్స్ మీకోసమే.. ఐఫోన్ 16, మ్యాక్‌బుక్ ఎయిర్ M4పై ఊహించని డిస్కౌంట్లు.. కొంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!
Croma Apple Sale : క్రోమా ఎవ్రీథింగ్ ఆపిల్ సేల్‌లో ఐఫోన్ 16 ధర రూ.35,991, మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర రూ.59,320 ఉండగా ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లు, టాటా న్యూ బెనిఫిట్స్ అందిస్తుంది.
Croma Apple Sale
- మార్చి 8వరకు క్రోమా ఎవ్రీథింగ్ ఆపిల్ సేల్
- ఐఫోన్ 16 బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 35,991
- పాత స్మార్ట్‌ఫోన్‌పై రూ.16వేల వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్
- రూ.1,5000 వరకు డిస్కౌంట్ కూపన్
Croma Apple Sale : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. టాటా యాజమాన్యంలోని ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా ఎవ్రీథింగ్ ఆపిల్ సేల్ మార్చి 8 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో కాలేజీకి వెళ్లే విద్యార్థుల నుంచి కంటెంట్ క్రియేటర్ల వరకు నిపుణులు తమ ప్రస్తుత ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను పొందవచ్చు.
మీ పాత ఫోన్ లేదా ల్యాప్‌టాప్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఐఫోన్ల నుంచి మ్యాక్‌బుక్‌ల వరకు క్రోమా వైడ్ రేంజ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అలాగే, HDFC TATA Neu కార్డ్ హోల్డర్లు అదనంగా 10 శాతం తగ్గింపు పొందవచ్చు.
ఐఫోన్ 16 బేస్ వేరియంట్ ధర ఎంతంటే? :
ఎవ్రీథింగ్ ఆపిల్ సేల్‌లో భాగంగా ఆపిల్ ఐఫోన్ 16 బేస్ వేరియంట్ 128GB స్టోరేజ్ ప్రారంభ ధర రూ. 35,991 నుంచి కొనుగోలు చేయొచ్చునని క్రోమా తెలిపింది. ఈ ఆఫర్ పొందే కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌పై రూ.16వేల వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
రూ.6వేల వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందుతారని క్రోమా తెలిపింది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ.1,5000 వరకు డిస్కౌంట్ కూపన్ పొందవచ్చు. రూ.3,999 వరకు టాటా న్యూ కాయిన్స్ బెనిఫిట్ కూడా పొందవచ్చు.
Read Also : Redmi Note 14 Pro Plus : ఆఫర్ అదిరింది భయ్యా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రెడ్మి ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. ఎంతంటే?
మ్యాక్‌బుక్ ఎయిర్ M4పై భారీ తగ్గింపు :
అదేవిధంగా, ఈ ఆపిల్ సేల్ సమయంలో 13-అంగుళాల వెర్షన్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4పై భారీ తగ్గింపుతో లభిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ ల్యాప్‌టాప్ ధర రూ.59,320కు అందుబాటులో ఉంటుంది.
ఆఫర్ కోసం కస్టమర్లు స్టూడెంట్, టీచర్ ఆఫర్ ధర రూ.88,911 నుంచి మొదలై రూ.13,000 వరకు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్, రూ.10వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌కు అర్హులు అవుతారని క్రోమా తెలిపింది. అలాగే రూ.6,591 వరకు టాటా న్యూ (Tata Nue) కాయిన్స్ కూడా పొందవచ్చు.
ఐఫోన్ 16, మ్యాక్‌బుక్ ఎయిర్ M4 కాకుండా ఐప్యాడ్ 11వ జెన్ రూ.29,489కి అమ్ముడవుతోంది. ఆపిల్ వాచ్ SE 3, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 వరుసగా రూ.23,388, రూ.23,310కి కొనుగోలు చేయవచ్చు. మీరు 512GB స్టోరేజ్‌తో ఐఫోన్ ఎయిర్ లేదా ఐఫోన్ 17 ప్రోని కొనుగోలు చేస్తే క్రోమా రూ.12,900 విలువైన ఆపిల్ కేర్ ప్లస్, ఎయిర్ ప్యాడ్ కూడా ఫ్రీగా అందిస్తోంది.
