Top Split AC Offers : సమ్మర్ వచ్చేస్తోంది.. 1.5 టన్ స్ప్లిట్ ఏసీలపై దిమ్మతిరిగే ఆఫర్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
Top AC Offers : కొత్త ఏసీ కొనేవారికి గుడ్ న్యూస్. క్రోమా, అమెజాన్ ప్లాట్‌ఫారాల్లో టాప్ బ్రాండ్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. లిమిటెడ్ డీల్స్ డోంట్ మిస్..
Top AC Offers
- అమెజాన్, క్రోమాలో టాప్ స్ప్లిట్ ఏసీలు ధరలు
- 1.5 టన్ స్ప్లిట్ ఏసీలపై భారీ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు
- వేసవి సీజన్లో భారీగా తగ్గనున్న స్ప్లిట్ ఏసీల ధరలు
Top Split AC Offers : చలి పోయింది.. ఎండలు పెరుగుతున్నాయి. కొద్దికొద్దిగా ఉక్కపోత మొదలవుతోంది. ఇక ఎండకాలం వచ్చేసింది అనిపిస్తుందా? అయితే, ఇప్పుడే ఏసీలు, కూలర్లు కొనేసుకోవడం బెటర్. ఎందుకంటే.. ఎండలు పెరిగే కొద్ది ఏసీలు, కూలర్ల ధరలు కూడా అమాంతం పెరిగిపోతాయి. మార్కెట్ డిమాండ్ కొద్ది ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరలో కావాలంటే ఏసీలు సమ్మర్ ప్రారంభానికి ముందే కొనేసుకుంటే తక్కువలో వస్తుంది.
అదే సీజన్ సమయంలో అయితే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. వేసవిలో అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా ఉంటాయి. మీరు కూడా కొత్తే ఏసీ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే..
తక్కువ బడ్జెట్లో 1.5-టన్ను సామర్థ్యం గల ఏసీలను కొనుగోలు చేసుకోవచ్చు. రూ. 30వేల నుంచి రూ. 40వేల మధ్యలో క్రోమా, అమెజాన్ నుంచి కొన్ని ఏసీ డీల్స్ మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ఏసీని ఎంచుకుని కొనేసుకోండి.
క్రోమాలో ఆఫర్లు ఇలా :
హైయర్ 1.5 టన్ ఏసీ 3-స్టార్ లేదా 5-స్టార్ ఇన్వర్టర్ మోడల్స్ :
హైయర్ అద్భుతమైన కూలింగ్, ‘ఫ్రాస్ట్ సెల్ఫ్-క్లీన్’ టెక్నాలజీ, పవర్ కెపాసిటీ (60శాతం వరకు పవర్ సేవింగ్) కోసం కూడా పాపులర్ బ్రాండ్. ఈ ఏసీ 54°C ఉష్ణోగ్రత వద్ద కూడా అద్భుతమైన కూలింగ్ అందిస్తుంది. 1.5 టన్ను సామర్థ్యం, 5-స్టార్ రేటింగ్‌తో కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ధర సుమారు రూ. 36వేల నుంచి రూ. 45వేల వరకు ఉంటుంది.
గోద్రేజ్ పీ-సిరీస్ కన్వర్టిబుల్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
గోద్రేజ్ నుంచి క్రోమాలో ఈ 1.5-టన్నుల ఏసీని రూ. 27,990కి కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ. 42,300 ఉంటుంది. కాపర్ కండెన్సర్, 5 ఏళ్ల వారంటీతో వస్తుంది. యాంటీ-ఫ్రీజ్ థర్మోస్టాట్, సైలెంట్ ఆపరేషన్ అందిస్తుంది. ఈ ఏసీ 52°C వరకు టెంపరేచర్ వద్ద కూడా కూలింగ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
బ్లూ స్టార్ Y సిరీస్ 5-ఇన్-1 కన్వర్టిబుల్ 1.5 టన్ 3-స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
బ్లూ స్టార్ నుంచి వచ్చిన ఈ 5-ఇన్-1 కన్వర్టిబుల్ ఏసీ 1.5-టన్నుల సామర్థ్యంతో వస్తుంది. ధర రూ. 56,400కు పొందవచ్చు. క్రోమా నుంచి రూ.32,490కి కొనుగోలు చేయవచ్చు. కాపర్ కండెన్సర్, ఏడాది వారంటీతో వస్తుంది. 10 ఏళ్ల కంప్రెసర్ వారంటీతో ఇన్వర్టర్ రోటరీ కంప్రెసర్, ఎకో మోడ్, టర్బో కూల్ వంటి ఫీచర్లతో వస్తుంది.
అమెజాన్‌లో ఏసీలపై ఆఫర్లు :
హిటాచీ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
హిటాచీ నుంచి వచ్చిన ఈ 1.5-టన్ను స్ప్లిట్ ఏసీ అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకే అందుబాటులో ఉంది. అసలు రూ. 63,850 ఉండగా 49 శాతం వరకు తగ్గింపుతో ధర రూ. 32,690కు పొందవచ్చు. ఈ ఏసీ ఫాస్ట్ కూలింగ్, తక్కువ పవర్ తీసుకుంటుంది. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్, ఆటో-కన్వర్టిబుల్ ఫీచర్‌తో వస్తుంది.
లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
లాయిడ్ నుంచి వచ్చిన ఈ 1.5-టన్నుల ఏసీ 5-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్‌తో వస్తుంది. 3-స్టార్ రేటింగ్‌తో లభిస్తుంది. మీరు రూ. 30,990కి పొందవచ్చు. అసలు ధర రూ. 58,990తో పోలిస్తే 47 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.
ఈ ఏసీ విషయానికి వస్తే.. 52 డిగ్రీల సెల్సియస్ వరకు కూలింగ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు.. క్లీన్ ఎయిర్ ఫిల్టర్‌తో టర్బో కూల్‌తో వస్తుంది. మరిన్ని వివరాల కోసం మీరు రెండు వెబ్సైట్లను విజిట్ చేసి అందుబాటులో ఇతర ఆఫర్లను ఎంచుకోవచ్చు.
