Daily Essential Prices: ఎల్‌నినో దెబ్బకు భగ్గుమంటున్న ధరలు.. ప్రతి కుటుంబంపైనా రూ.1500 అదనపు భారం.. ఏవేవి పెరిగాయో తెలుసా?
దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం వల్ల నిత్యావసర సరుకులు(Daily Essential Prices), కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.
El nino impact on essential commodities vegetable prices surge in india 2026
Daily Essential Prices: దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం వల్ల నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పలు ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం క్షీణించి పంట దిగుబడులు దారుణంగా పడిపోయాయి. దీనికి తోడు అంతర్జాతీయ ఘర్షణలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా వ్యయం పెరిగి సరుకుల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా గత రెండు నెలల్లో నిత్యావసరాల ధరలు 5 శాతం నుంచి 45 శాతం వరకు పెరగడంతో ప్రతి కుటుంబంపైనా నెలకు సగటున రూ.1,500 వరకు అదనపు భారం పడుతోంది.
Telangana Rains: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రానున్న రెండు రోజులు వర్ష సూచన.. వాతావరణ శాఖ కీలక ప్రకటన
రూ.2 వేలకు బియ్యం బస్తా.. సెంచరీకి చేరువలో ఉల్లిపాయలు:
మధ్యతరగతి, సామాన్య ప్రజల నెలవారీ బడ్జెట్‌పై ఈ ధరల మంట తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో రూ.1,200 లభించిన 25 కిలోల బియ్యం (Daily Essential Prices)బస్తా ధర ఇప్పుడు ఏకంగా రూ.2,000కు చేరుకుంది. కిలో రూ.40గా ఉన్న ఉల్లిపాయల ధరలు ప్రస్తుతం రూ.80కి చేరి సెంచరీ దిశగా పయనిస్తున్నాయి. పప్పుధాన్యాలైన కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. నీటి సౌకర్యం ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో తప్ప మిగిలిన చోట్ల పంటలు పండకపోవడం ఈ కొరతకు ప్రధాన కారణమైంది.
మండిపోతున్న కూరగాయల మార్కెట్.. తగ్గని భారం:
కూరగాయల మార్కెట్లోనూ అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం కిలో పెద్ద చిక్కుళ్లు రూ.100 పలుకుతుండగా, క్యాప్సికం రూ.65, పచ్చిమిర్చి రూ.55, వంకాయ రూ.49, బీరకాయ రూ.45గా విక్రయిస్తున్నారు. అలాగే టమాటా రూ.33, దోసకాయ రూ.36, దొండకాయ రూ.30 వద్ద కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో వర్షాభావం ఇలాగే కొనసాగితే నీటి ఎద్దడి వల్ల ఈ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.
