EPFO Update : మీ జాబ్ మానేశారా? EPFO పోర్టల్‌లో మీ ఎగ్జిట్ తేదీని అర్జెంట్‌గా అప్డేట్ చేయండి!
EPFO Update : ఈపీఎఫ్ఓలో మీ రిటైర్మెంట్ సేవింగ్ కోసం మీ సర్వీసు రికార్డులను అప్డేట్ చేయడం చాలా ముఖ్యం. ఈ సింపుల్ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
EPF account Holders
- ఈపీఎఫ్ఓలో రిటైర్మెంట్ సేవింగ్ కోసం మీ జాబ్ రికార్డు అప్డేట్ చేయండి.
- పీఎఫ్ ద్వారా రిటైర్మెంట్ సేవింగ్, పింఛను సౌకర్యాన్ని పొందవచ్చు
- ఈపీఎఫ్ఓ ద్వారా మీ ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేయాలంటే?
EPFO Update : మీరు ప్రస్తుత కంపెనీలో జాబ్ మానేశారా? అయితే ఇది మీకోసమే.. మీ పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే ముందుగా మీరు ఈ పనిచేయాలి. రిటైర్ సేవింగ్ కోసం ఈపీఎఫ్ఓ వద్ద మీ జాబ్ ఎగ్జిట్ డేట్ తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. సాధారణంగా మీరు జాబ్ ఎగ్జిట్ అయిన వెంటనే కంపెనీలే ఈ పని చేస్తాయి. కానీ, కొన్నిసార్లు అప్డేట్కు చాలా సమయం పట్టవచ్చు.
అప్పటివరకూ వేచి ఉండటం కన్నా మీకు మీరే అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ కంపెనీపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో ఉద్యోగం మానేసిన తేదీని ఎంటర్ చేయగానే మీ సర్వీస్ రికార్డు అప్డేట్ అవుతుంది.
తద్వారా ఆ కంపెనీతో మీ సర్వీసు ముగుస్తుంది. కొత్త కంపెనీతో మళ్లీ సర్వీసును ప్రారంభించవచ్చు. ఈపీఎఫ్ఓ వద్ద మీ ఎగ్జిట్ తేదీని అప్డేట్ చేస్తే మీ పీఎఫ్ డబ్బులను ఈజీగా విత్‌డ్రా చేయొచ్చు.
ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉందా? :
అంతేకాదు.. మీ జాబ్ మానేసి రెండు నెలలకు పైగా ఉండాలి. అలాగే, మీ ఆధార్ నంబర్ పోర్టల్‌లో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. దీనిపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈపీఎఫ్ఓ ద్వారా మీ ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేయాలి? :
- ముందుగా, వెబ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ విజిట్ చేయండి.
- ‘ఆన్లైన్ క్లెయిమ్ మెంబర్ అకౌంట్ ట్రాన్స్ఫర్’ఆప్షన్ ఎంచుకోండి.
- మీ UAN, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి.
- నావిగేషన్ బార్లో ‘Manage’పై క్లిక్ చేసి ‘Exit’ను ఎంచుకోండి.
- ‘Employment’ పక్కన డ్రాప్‌డౌన్ మెనూ నుంచి మీ కంపెనీని ఎంచుకోండి.
- స్క్రీన్‌పై కనిపించే డేటాను ఎంటర్ చేసి ‘Submit’పై క్లిక్ చేయండి.
- మీ అకౌంట్ నంబర్ OTP ఎంటర్ చేసి మరోసారి ‘Submit’ ట్యాప్ చేయండి.
ఎగ్జిట్ డేట్ అప్డేట్ బెనిఫిట్స్ :
ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో మీ జాబ్ ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేయొచ్చు. మీ కంపెనీ అనుమతి అవసరం లేకుండానే మీరు మీ పీఎఫ్ ఫండ్స్ లేదా పెన్షన్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు కంపెనీ మార్చినప్పుడల్లా ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంటుకు ఫండ్స్ ట్రాన్స్ ఫర్ చేయడం ఈజీ అవుతుంది. మీ సర్వీస్ హిస్టరీ డేటాలో తప్పులు లేకుండా చూడొచ్చు. అంతేకాదు.. మీ అకౌంట్ డేటాపై మీకు కంట్రోలింగ్ ఇస్తుంది.
