Motorola Edge 50 Fusion : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ సేల్.. అతి తక్కువ ధరకే మోటోరోలా ఫోన్ మీ సొంతం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

Motorola Edge 50 Fusion : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ సేల్ 2025 సమయంలో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర తగ్గింది.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Motorola Edge 50 Fusion : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ సేల్.. అతి తక్కువ ధరకే మోటోరోలా ఫోన్ మీ సొంతం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

Motorola Edge 50 Fusion

Updated On : July 5, 2025 / 3:20 PM IST

Motorola Edge 50 Fusion : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ సేల్ 2025 సందర్భంగా మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర భారీగా తగ్గింది. కొత్త, చౌకైన స్మార్ట్‌ఫోన్‌ (Motorola Edge 50 Fusion) కొనేందుకు సరైన సమయం.

ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో సేవింగ్స్ సేల్ ద్వారా కస్టమర్‌లు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌ను భారీ తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. అనేక డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా పొందవచ్చు. ఈ మోటోరోలా ఫోన్‌ను సరసమైన ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..

డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆప్షన్ :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 8GB, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27999 ఉండగా ఫ్లిప్‌కార్ట్ నుంచి 25 శాతం తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. అసలు ధర నుంచి రూ. 20,999 ధరను మరింత తగ్గించవచ్చు.

బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై రూ. 1000 తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై కూడా క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. రూ. 20,250 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఈ ఫోన్‌తో రూ. 3500 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.

Read Also : iQOO 13 Launch : అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఐక్యూ 13 ఫోన్ ఆగయా.. ఈసారి గ్రీన్ కలర్ వేరియంట్.. ధర ఎంతో తెలుసా?

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు :
ఈ మోటోరోలా ఫోన్ 6.7-అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గరిష్ట ప్రకాశంతో 1600 నిట్స్, పర్ఫార్మెన్స్ కోసం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అదే సమయంలో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్‌ప్లే కలిగి ఉంది.

కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా కలిగి ఉంది. పవర్ విషయానికొస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ IP68 రెసిస్టెన్స్‌తో కూడా వస్తుంది.