Flipkart Freedom Sale 2026 : ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌టీవీలపై అదిరే ఆఫర్లు.. రూ. 80వేల విలువైన 65-అంగుళాల స్మార్ట్‌టీవీ జస్ట్ రూ.37,349కే..!
Flipkart Freedom Sale 2026 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అనేక స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. మీకు నచ్చిన టీవీని ఇంటికి తెచ్చుకోవచ్చు.
Flipkart Freedom Sale 2026
- ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు
- రియల్‌మి టెక్లైఫ్ 65-అంగుళాల 4K స్మార్ట్ టీవీ
- టీసీఎల్ T6C 65-అంగుళాల QLED 4K టీవీ
- మోటోరోలా 65 అంగుళాల QLED అల్ట్రా 4K స్మార్ట్ టీవీ
Flipkart Freedom Sale 2026 : కొత్త స్మార్ట్ టీవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. ఆగస్టులో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో అనేక అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేయనుంది. మీ ఇల్లు లేదా ఆఫీస్ కోసం కొత్త స్మార్ట్ టీవీని కొనాలని చూస్తుంటే ఈ ఇ-కామర్స్ సైట్ అద్భుతమైన డీల్స్‌ను మీకోసం అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో 65-అంగుళాల స్మార్ట్ టీవీలపై ఆఫర్లను వివరంగా పరిశీలిద్దాం..
టీసీఎల్ T6C 65 అంగుళాల QLED 4K స్మార్ట్ టీవీ :
ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 56,990కి లిస్ట్ అయింది. ఈ టీసీఎల్ టీవీలో 65-అంగుళాల (Flipkart Freedom Sale 2026) క్యూఎల్ఈడీ అల్ట్రా HD (4K) డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+కు సపోర్టు ఇస్తుంది. డాల్బీ విజన్ అట్మోస్ 24Wకు సపోర్ట్ చేస్తుంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్లపై రూ.7,400 డిస్కౌంట్ పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ. 49,590 అవుతుంది.
రియల్‌మి టెక్లైఫ్ 65-అంగుళాల 4K స్మార్ట్ టీవీ 2025 :
రియల్‌మి టెక్లైఫ్ అసలు ధర రూ. 80,199 నుంచి తగ్గి ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 39,999 ధరకు లిస్ట్ అయింది. ఈ రియల్‌మి టెక్లైఫ్ టీవీ 65-అంగుళాల అల్ట్రా HD 4K ఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. డాల్బీ ఆడియో, 30W డౌన్ఫైరింగ్ స్పీకర్లతో వస్తుంది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు పేమెంట్లపై రూ. 2,750 తగ్గింపు లభిస్తుంది. తద్వారా ధర రూ. 37,249 అవుతుంది.
మోటోరోలా 65-అంగుళాల QLED అల్ట్రా 4K స్మార్ట్ గూగుల్ టీవీ :
ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 49,999 ధరకు లిస్ట్ అయింది. ఈ మోటోరోలా టీవీలో 120Hz గేమ్ యాక్సిలరేటర్‌తో 65-అంగుళాల డిస్ప్లే ఉంది. 50W స్పీకర్లతో వస్తుంది. డాల్బీ అట్మోస్‌కు సపోర్టు ఇస్తుంది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 3,250 తగ్గింపు లభిస్తుంది. ధర రూ. 46,749 అవుతుంది.
శాంసంగ్ విజన్ ఏఐ 65 అంగుళాల స్మార్ట్ టైజెన్ టీవీ :
ఈ-కామర్స్ సైట్లో ఈ శాంసంగ్ ఏఐ టీవీ రూ. 79,990కి లిస్ట్ అయింది. ఈ శాంసంగ్ టీవీ 65-అంగుళాల 4K మినీ ఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. స్మార్ట్ టైజెన్ టీవీ 2026పై రన్ అవుతుంది. 30W పవర్ఫుల్ స్పీకర్లతో వస్తుంది. శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ 150+ ఫ్రీ ఛానల్ డైనమిక్ సౌండ్ ప్యాక్‌తో వస్తుంది. బ్యాంక్ ఆఫర్ల పరంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీపై రూ. 4,750 డిస్కౌంట్ పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ. 75,240 అవుతుంది.
ఫిలిప్స్ 65 అంగుళాల QLED 4K స్మార్ట్ గూగుల్ టీవీ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీ రూ. 55,999కి లిస్ట్ అయింది. ఈ ఫిలిప్స్ టీవీలో 65-అంగుళాల QLED అల్ట్రా HD 4K డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి. ఇందులో 30W డాల్బీ అట్మోస్ స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీలో 32GB స్టోరేజ్ ఉంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.3,550 డిస్కౌంట్ పొందవచ్చు. ఆపై ధర రూ. 52,449కే ఫిలిప్స్ టీవీ కొనేసుకోవచ్చు.
