Aadhaar Update Deadline : మీవి, పిల్లలవి ఆధార్ అప్డేట్ చేయలేదా? మీకో బంపర్ ఆఫర్..
Aadhaar Update Deadline : యూఐడీఏఐ మైఆధార్ పోర్టల్‌లో ఫ్రీ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీసును పొడిగించింది. ఆధార్ హోల్డర్లు ఇప్పుడు ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను జూన్ 14, 2027 వరకు ఎలాంటి రుసుము లేకుండా అప్డేట్ చేసుకోవచ్చు.
Aadhaar Update Deadline
Aadhaar Update Deadline : మీ ఆధార్ అప్డేట్ చేసుకున్నారా? అలాగే మీ పిల్లల ఆధార్ కూడా అప్డేట్ చేయలేదా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఫ్రీ ఆధార్ అప్ డేట్ డెడ్ లైన్ మళ్లీ పొడిగించారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మైఆధార్ పోర్టల్‌లో ఫ్రీ ఆన్లైన్ ఆధార్ డాక్యుమెంట్ అప్ డేట్ సర్వీసు మరో ఏడాది పాటు కొనసాగుతుందని ప్రకటించింది.
ఆధార్ హోల్డర్లు తమ యూఐడీ కార్డులోని డాక్యుమెంట్లను మైఆధార్ పోర్టల్ ద్వారా జూన్ 14, 2026 వరకు ఎలాంటి రుసుము లేకుండా అప్ డేట్ చేసుకోవచ్చునని యూఐడీఏఐ తెలిపింది. ఆన్లైన్లో డేటాను అప్డేట్ చేసే ఆధార్ (Aadhaar Update Deadline) కార్డుదారుల నుంచి సానుకూల స్పందనతో అప్డేట్ పొడిగించినట్టు యూఐడీఏఐ పేర్కొంది.
మైఆధార్ యాప్‌ను త్వరలో నిలిచిపోతుంది. ఆధార్ హోల్డర్లు ఇప్పుడు కొత్త ఆధార్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలియజేసింది. ఈ కొత్త యాప్ సేఫ్ క్యూఆర్ ఆధారిత ఆధార్ షేరింగ్, మెరుగైన ప్రైవసీ కంట్రోలింగ్, ఆధార్ సేవలకు నిరంతరాయ యాక్సెస్ వంటి ఫీచర్లను అందిస్తుంది.
మైఆధార్ పోర్టల్‌లో ఆధార్ ఫ్రీ అప్డేట్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే? :
గతంలో రుసుము వసూలు చేసే ఆన్లైన్ సర్వీసు ఇప్పుడు జూన్ 14, 2027 వరకు మైఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయాన్ని మరో ఏడాది పాటు (జూన్ 15, 2026 నుంచి జూన్ 14, 2027 వరకు) పొడిగించాలని నిర్ణయించింది.
దీని ప్రకారం.. https://myaadhaar.uidai.gov.in/లోని మైఆధార్ పోర్టల్ ద్వారా డాక్యుమెంట్లను అప్ డేట్ చేసే సదుపాయం జూన్ 14, 2027 వరకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని కార్యాలయ మెమోరాండం (OM) పేర్కొంది.
ఆధార్ కార్డుదారులకు ఎలా బెనిఫిట్ ఉంటుందంటే? :
తమ ఐడెంటిటీ, అడ్రస్ డాక్యుమెంట్లను అప్ డేట్ చేయాల్సిన ఆధార్ యూజర్లు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఆన్లైన్లోనే ఈ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. ఈ ఫ్రీ అప్డేట్ సౌకర్యం కేవలం మైఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది.
The #mAadhaar App is retiring soon. Now experience a smarter, faster, and more secure digital journey with the new #AadhaarApp. From secure QR-based #Aadhaar sharing to enhanced privacy controls and seamless access to Aadhaar services — the new app is designed to make your… pic.twitter.com/snfeUx4Rgr
— Aadhaar (@UIDAI) May 15, 2026
ఆధార్ డేటాబేస్‌లో కచ్చితత్వాన్ని పాటించేందుకు ముఖ్యంగా చాలా ఏళ్ల క్రితం ఆధార్ పొంది, ఇటీవల డాక్యుమెంట్లను అప్ డేట్ చేయని వారు, సపోర్టు డాక్యుమెంట్లతో అప్లోడ్ చేయాలని యూఐడీఏఐ సూచిస్తోంది.
ఆధార్ డాక్యుమెంట్లను ఆన్లైన్లో ఎలా సబ్మిట్ చేయాలి? :
- ఆధార్ అధికారిక సైట్ (https://myaadhaar.uidai.gov.in)కు వెళ్లి మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)తో లాగిన్ అవ్వండి.
- ప్రొఫైల్‌లో కనిపించే మీ ఐడెంటిటీ, అడ్రస్ వివరాలను చెక్ చేయండి.
- ప్రొఫైల్‌లో కనిపించే వివరాలు తప్పుగా ఉంటే కింది ప్రశ్న 5కు ఇచ్చిన సమాధానంలో మాదిరిగా చర్య తీసుకోండి.
- మీ ప్రొఫైల్‌లో కనిపించే వివరాలు సరిగ్గా ఉంటే.. దయచేసి ‘I verify that the above details are correct’ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- సబ్మిట్ చేసే ఐడెంటిటీ డాక్యుమెంట్ డ్రాప్-డౌన్ మెనూ నుంచి ఎంచుకోండి.
- మీ ఐడెంటిటీ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి (సైజు 2MB కన్నా తక్కువ; ఫైల్ ఫార్మాట్ JPEG, PNG లేదా PDF).
- మీరు సబ్మిట్ చేసే అడ్రస్ డాక్యుమెంట్ డ్రాప్-డౌన్ మెనూ నుంచి ఎంచుకోండి.
- మీ అడ్రస్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి (సైజు 2MB కన్నా తక్కువ; ఫైల్ ఫార్మాట్ JPEG, PNG లేదా PDF). మీ సమ్మతిని సబ్మిట్ చేయండి.
ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ కోసం అయ్యే ఖర్చులివే :
ఆధార్ కార్డు అప్డేట్ ఛార్జీలు ఈ కింది విధంగా ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.
1. బయోమెట్రిక్ అప్డేట్ :
(ఫింగర్ ఫ్రింట్, ఐరీస్, ఫొటో అప్డేట్)
5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వయస్సు మధ్య ఫస్ట్ అప్డేట్ : ఉచితం
15 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయస్సు మధ్య మొదటి లేదా రెండో అప్డేట్ : ఉచితం
ఇతర బయోమెట్రిక్ అప్డేట్లు : రూ. 125
ప్రత్యేక సడలింపు : 7 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయస్సు మధ్య అప్డేట్లు సెప్టెంబర్ 30, 2026 వరకు ఉచితం.
2. జనాభా వివరాల అప్డేట్ :
(పేరు, లింగం, పుట్టిన తేదీ, అడ్రస్, మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ అప్డేట్)
బయోమెట్రిక్ అప్డేట్తో పాటు : ఉచితం
విడిగా చేస్తే : రూ. 75
3. డాక్యుమెంట్ అప్డేట్ :
(ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లు)
మైఆధార్ పోర్టల్ ద్వారా : జూన్ 14, 2026 వరకు ఉచితం (ఇప్పుడు జూన్ 2027 వరకు పొడిగింపు)
ఆధార్ కేంద్రంలో : రూ. 75
