FSSAI New Rule : ఫుడ్ లవర్స్‌కు బిగ్ అలర్ట్.. చిప్స్, బిస్కెట్లపై ఇక ‘రెడ్ లేబుల్ ఫ్లాగ్’.. FSSAI కొత్త రూల్ ఇదే!
FSSAI New Rule : చిప్స్, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ వంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై రెడ్ వార్నింగ్ లేబుల్స్ తీసుకురావాలని FSSAI ప్రతిపాదించింది. కొత్త రూల్స్ పూర్తి వివరాలు ఇవే.
FSSAI New Rule
- చిప్స్, బిస్కెట్లపై రెడ్ లేబుల్ వార్నింగ్
- ఫుడ్ లవర్స్ తప్పక తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్
- హై షుగర్.. హై సాల్ట్ ఇక దాచలేరు..
- కూల్ డ్రింక్ నుంచి చిప్స్ వరకు రెడ్ మార్క్ ఉందా? చెక్ చేయండి
FSSAI New Rule : ఫుడ్ లవర్స్‌కు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ప్యాకేజ్డ్ ఫుడ్స్ తెగ తినేస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. ఇకపై చిప్స్ ప్యాకెట్ తీసుకున్నా? బిస్కెట్ ప్యాకెట్ చూసినా కూల్ డ్రింక్ బాటిల్ కొనబోతున్నా? సరే ఏది కొన్నా ఫ్రంట్ సైడ్ మీకో రెడ్ లేబుల్ ఫ్లాగ్ కనిపించనుంది. హై షుగర్, సాల్ట్, ఫ్యాట్ ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ను ఈజీగా గుర్తించేలా కొత్త లేబులింగ్ విధానాన్ని తీసుకురావాలని FSSAI ప్రతిపాదించింది.
ఈ అంశంపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI New Rule) సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ప్రతిపాదన ప్రకారం.. నిర్దేశిత పరిమితులకు మించి హానికర పోషకాలు ఉన్న ఆహార ఉత్పత్తుల ప్యాకెట్ ముందు భాగంలో రెడ్ కలర్ షడ్భుజి (హెక్సాగన్) వార్నింగ్ గుర్తు కనిపిస్తుంది.
అంటే.. ఈ ప్రొడక్టులో ఫ్యాట్ ఎక్కువగా ఉంటే ‘High Fat’, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే ‘High Sugar’, సాల్ట్ ఎక్కువగా ఉంటే ‘High Salt’ వంటి వార్నింగ్ లేబుల్స్ స్పష్టంగా కనిపించేలా చేయనున్నారు. ఒకటి కన్నా ఎక్కువ పోషకవిలువలు అధికంగా ఉంటే వాటి వివరాలను ఇకపై కలిపి చూపిస్తారు.
అధికంగా చక్కర కలిపిన పానీయాలకు ప్రత్యేకంగా ‘Highly Sweetened Beverage’ అనే వార్నింగ్ లేబుల్ కూడా ఇక ఫుడ్ ప్యాకేజ్డ్ ప్యాకేట్లపై కనిపించనుంది. ముఖ్యంగా ఈ సమాచారాన్ని ప్యాకెట్ బ్యాక్ సైడ్ చిన్న అక్షరాల్లో దాచిపెట్టకుండా, ఫ్రంట్ సైడ్ వినియోగదారులకు పెద్దగా కనిపించనుంది. ఇందుకోసం వార్నింగ్ అక్షరాల ఫాంట్ సైజును కూడా పెంచాలని FSSAI ప్రతిపాదించింది.
రెండు దశల్లో అమలు? :
ఈ కొత్త ఫ్రంట్ ప్యాక్ న్యూట్రిషియన్ లేబులింగ్ (FoPNL) విధానాన్ని దశలవారీగా అమలు చేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ భావిస్తోంది. తొలి దశలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు నిర్దేశిత పరిమితులను మించిన ఉత్పత్తులను చేర్చనున్నారు. ఆ తర్వాత ఒక్క పోషకం అధికంగా ఉన్న ఉత్పత్తులకు కూడా ఈ నిబంధనను విస్తరించే అవకాశం ఉంది.
వీటికి మాత్రం మినహాయింపు :
ఒకే పదార్థంతో తయారైనా ప్రొడక్టు లేదా నేచురల్ ఫ్యాట్, షుగర్, సాల్ట్ ఎక్కువగా ఉండే కొన్ని ప్రొడక్టులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. నెయ్యి, వంట నూనె, చక్కెర, బెల్లం, తేనె వంటి ఉత్పత్తులు ఇందులో ఉండొచ్చు. అయితే, ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. పూర్తి స్థాయిలో నిబంధనలు, అమలు తేదీపై అధికారిక నిర్ణయం రావాల్సి ఉంది.
స్టార్ రేటింగ్ వివాదం :
ప్యాకేజ్డ్ ఫుడ్ లేబులింగ్ విషయంలో చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) మొదట్లో స్టార్-రేటింగ్ విధానాన్ని ఇండియన్ న్యూట్రిషన్ రేటింగ్ పేరుతో ప్రవేశపెట్టాలని భావించింది.
అయితే, కంపెనీలతో ఏకాభిప్రాయం కుదరక ఈ ప్లాన్ నిలిచిపోయింది. ఆ తర్వాత, 3S, అవర్ హెల్త్ సొసైటీ దాఖలు చేసిన పీఎల్ఐ (PLI) పిటిషన్‌పై విచారణ సమయంలో సుప్రీంకోర్టు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నేరుగా వార్నింగ్ కనిపించేలా రెడ్ కలర్ లేబుళ్లను ఉంచాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ అమలు చేయనుంది.
