Gold Price Today : బంగారం కొనుగోలుచేస్తున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్‌

తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో

Gold Price Today : బంగారం కొనుగోలుచేస్తున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్‌

Gold And Silver Price Today

Gold and Silver Price Today : బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ శాంతించాయి. రెండు రోజుల్లో 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 550 పెరిగింది. అయితే ఇవాళ బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. మరోవైపు వెండి ధరసైతం స్థిరంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా నమోదైన బంగారం, వెండి ధరలను ఓ సారి పరిశీలిద్దాం.

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
    తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,600కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,750.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,750 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,900.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,600 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,750.
    చెన్నైలో మాత్రం బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై రూ. 220 తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.68,050 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,240కు చేరింది.
  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా శనివారం వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 1,00,000.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
    చెన్నైలో కిలో వెండి ధర రూ.1,00,000.
    కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 95,500 వద్ద కొనసాగుతుంది.
    ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.95,500.
    బెంగళూరులో కిలో వెండి ధర రూ. 95,000 వద్ద కొనసాగుతుంది.

Gold Price Today

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.