Gold Rate : బంగారం, వెండి కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు

తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold Rate : బంగారం, వెండి కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు

Gold Price

Gold And Silver Price Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 208 తగ్గగా.. శనివారం ఏకంగా రూ. 2,080 తగ్గింది. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల 22 క్యారట్ల బంగారం ధరపై రూ. 1, 900 తగ్గగా.. 24 క్యారట్ల 10గ్రాముల బంగారంపై రూ. 2080 తగ్గింది. వెండిధరసైతం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 4,500 తగ్గింది.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,700కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.71,670.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.65,850 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 71,820.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.65,700 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 71,670.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.676,500 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,550.

 

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా వెండి ధర భారీ తగ్గింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 96,000.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ.96,000.
    కోల్ కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.91,500.
    బెంగళూరులో కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 93,350 వద్ద కొనసాగుతుంది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.