Gold Rate : మహిళలకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో
![Gold Rate : మహిళలకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా? Gold Rate : మహిళలకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?](https://10tv.in/wp-content/uploads/2024/07/Gold-200.jpg)
Gold
Gold And Silver Price Today : ఈ నెల ప్రారంభం నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు వరుసగా రెండోరోజు తగ్గాయి. సోమవారం 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 220 తగ్గగా.. ఇవాళ (మంగళవారం) రూ. 380 తగ్గింది. దీంతో రెండు రోజుల్లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.600 తగ్గుదల చోటు చేసుకుంది. మరోవైపు వెండి ధరసైతం తగ్గింది. దేశ వ్యాప్తంగా ఇవాళ్టి బంగారం, వెండి ధరలను ఓ సారి పరిశీలిస్తే..
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,200. - దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,250 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,350.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,100 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,200.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,700 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,850కు చేరింది.
- వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా మంగళవారం వెండి ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 99,000.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.99,000.
కోల్ కతాలో వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 95,100 వద్ద కొనసాగుతుంది.
ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.94,500.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 93,900 వద్ద కొనసాగుతుంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.