Gold Price Forecast 2026 : గోల్డ్ మార్కెట్ సెన్సేషన్.. బంగారం ధరలు పడిపోతాయా? మళ్లీ రాకెట్ వేగంతో పెరుగుతాయా? మోర్గాన్ అంచనాలివే!
Gold Price Forecast 2026 : బంగారం ధరలు పెరుగుతాయా? లేదా ఇంకా క్షీణిస్తాయా? బంగార కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లలో ఇదే ఆందోళన కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలపై మోర్గాన్ కీలక అంచనాలివే..

Gold Price Forecast 2026 : ఈ ఏడాదిలో బంగారం ధరలు ఒక్కసారిగా ఊహించని షాక్‌కు గురయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో ఒత్తిడి పెరగడంతో బంగారం విలువ భారీగా క్షీణిస్తోంది. ఒకప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా భావించిన పసిడి ఇప్పుడు అనిశ్చితి మధ్య ఊగిసలాటలో ఉంది.

మోర్గాన్ స్టాన్లీ తాజా అంచనాలు కూడా మార్కెట్లో కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఒకే ఒక ఇన్వెస్టర్లతో పాటు బంగారం కొనుగోలుదారులను కలవరపెడుతోంది. బంగారం ధరలు ఇంకా పడిపోతాయా? లేదా మళ్లీ రాకెట్ వేగంతో పెరుగుతాయా? అనేది అంతుపట్టడం లేదు. మోర్గాన్ కీలక అంచనాలేంటో ఇప్పుడు చూద్దాం..

బంగారం ధరల్లో భారీ క్షీణత : గత కొన్ని నెలలుగా గోల్డ్ మార్కెట్ ఊహించని విధంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గడం బంగారం ధరల తగ్గుదలకు అసలు కారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే గోల్డ్ ధరలు దాదాపు 8శాతం వరకు పడిపోయాయి. 6 వారాల పాటు కొనసాగిన భారీ అమ్మకాల ఒత్తిడి బులియన్ మార్కెట్‌ను గట్టిగా కుదిపేసింది.

అంతేకాదు.. సాధారణ మార్పులే కాదు.. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన కీలక మార్పుల కూడా బంగారం తగ్గడానికి కారణాలుగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఒకప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించిన బంగారం ఇప్పుడు అనిశ్చిత పరిస్థితుల్లో కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

బంగారం ధరలు తగ్గడానికి అసలు కారణాలివే : బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో వడ్డీ రేట్లు, బాండ్ యీల్డ్స్‌లో వచ్చిన మార్పులే దీనికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే.. బంగారం వడ్డీ ఇవ్వదు కదా.. అందుకే పెట్టుబడిదారులు బంగారం వైపు పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతారు.

కానీ, ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి అంతకన్నా భిన్నంగా కనిపిస్తోంది. వాస్తవ రాబడులు (real yields) పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపులో ఆలస్యం కారణంగా పెట్టుబడిదారులు బంగారం నుంచి బయటకు వెళ్లి బాండ్లు వంటి వడ్డీ అందించే ఆస్తుల వైపు మెగ్గుచూపుతున్నారు. ఈ కారణంగానే బంగారం డిమాండ్ మరింత తగ్గుతూ వస్తోంది.

మోర్గాన్ స్టాన్లీ అంచనా ఇదే : ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే.. మోర్గాన్ స్టాన్లీ 2026 బంగారం ధర అంచనాను భారీగా తగ్గించింది. గతం నాటి అంచనా ఔన్సుకు 5,700 డాలర్లుగా ఉండగా, ఇప్పుడు 5,200 డాలర్లకు తగ్గించింది. ఈ కోత మార్కెట్లో పెద్ద సంకేతంగా చెప్పవచ్చు. బంగారం భవిష్యత్తు మరింత కఠినంగా మారుతున్నదని మోర్గాన్ స్టాన్లీ అంచనా సూచిస్తోంది.

బంగారం భవిష్యత్తు ఏంటి? : మార్కెట్ నిపుణుల ప్రకారం.. గోల్డ్ పూర్తిగా బలహీనపడిందని కాదు.. పసిడి కేవలం వస్తువు కాదు.. ద్రవ్యోల్బణ భయాలు, కేంద్ర బ్యాంకుల విధానాలు, ప్రపంచ రాజకీయ అనిశ్చితి వంటి అంశాలను సూచించేది మాత్రమే.

బంగారం ధర భవిష్యత్తు పూర్తిగా ఆర్థిక డేటా, లిక్విడిటీ పరిస్థితులతో పాటు వడ్డీ విధానాలపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్లో కనిపిస్తున్న ఈ తగ్గుదల తాత్కాలిక విరామమా? పెను మార్పుకు సంకేతమా? అనేది రాబోయే నెలల్లో తేలిపోనుంది.
