Gold Rate decreased : గంటల వ్యవధిలోనే కుప్పకూలిన బంగారం ధర.. గతంలో ఎప్పుడూ లేనంతగా.. కొత్త ధరలు ఇవే!
Gold Rate decreased : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. ఇవాళ గోల్డ్ రేటు భారీగా పతనమైంది.
Gold Rate decreased
Gold Rate decreased : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. బంగారం ధర భారీగా తగ్గుతూ వస్తోంది. తాజాగా తులం గోల్డ్ పై రూ.10వేలు తగ్గింది.
గడిచిన ఆరు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ ఏకంగా తులం బంగారంపై రూ.10వేలు తగ్గింది. దీంతో మొత్తం ఆరు రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై సుమారు రూ.13,500 తగ్గుదల చోటు చేసుకుంది.
సోమవారం బంగారం ధరలను పరిశీలిస్తే.. ఉదయం తులం బంగారంపై రూ.5వేలు తగ్గింది. సాయంత్రం సమయానికి రూ.10వేలు తగ్గింది. దీంతో సోమవారం ఒక్కరోజు తులం బంగారంపై రూ.10వేలు తగ్గుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,35,650కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,24,350 వద్దకు పడిపోయింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..
దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,35,800 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,24,500 వద్దకు చేరుకుంది.
ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,35,650కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,24,350 వద్దకు చేరింది.
వెండి ధర సోమవారం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.20వేలు తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,30,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,25,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,30,000 వద్ద కొనసాగుతుంది.
