HDFC UPI ATM Withdrawal Rules: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్ నుంచి మారనున్న ATM విత్ డ్రా రూల్స్.. ఇకపై బాదుడే
HDFC UPI ATM Withdrawal Rules: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన చేసింది. ఏటీఎం క్యాష్ విత్ డ్రాలకు సంబంధించి ఏప్రిల్ నుంచి కొత్త రూల్ అమలు చేయనుంది.
- Dharani Pilli
- Published On : March 6, 2026 / 06:24 PM IST
HDFC Bank changed UPI based ATM withdrawal rules from April 2026
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. దాని ఏటీఎం క్యాష్ విత్‌డ్రాపై కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత క్యాష్ విత్‌డ్రాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంలలో UPIని ఉపయోగించి చేసే నగదు విత్‌డ్రాలు.. ఇకపై వినియోగదారులకు నెలవారీ ఉచితంగా అందిస్తున్న ATM లావాదేవీ పరిమితిలో చేర్చబడతాయని ప్రకటించింది. ఉచిత పరిమితి ముగిసిన తర్వాత, UPI ఆధారిత నగదు విత్‌డ్రాలకు కూడా ఇకపై సాధారణ ATM లావాదేవీలకు వర్తించే మాదిరి ఛార్జీలను విధించనుంది. ఈ కొత్త నియమం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. పరిమితి దాటితే.. యూపీఐ బేస్డ్ విత్‌డ్రాయల్స్ ఇకపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ పరిధిలోకే వస్తాయి. ఈ లిమిట్ పూర్తయ్యాక.. ఛార్జీలు వర్తిస్తాయి.
ఏప్రిల్ 1 నుంచి.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంలలో.. యూపీఐ క్యాష్ విత్‌డ్రా పరిమితి దాటితే.. మిగతా రెగ్యులర్ ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయల్ మాదిరిగానే.. వీటిపై ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఉచిత పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్‌పై 23 రూపాయలతో పాటుగా.. అప్లికేబుల్ టాక్సెస్ వర్తిస్తాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం పొదుపు ఖాతాలు, శాలరీ అకౌంట్లకు సంబంధించి ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై లిమిట్ విధిస్తుంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మెట్రో నగరాల్లోని తన కస్టమర్లకు 3 ఉచిత లావాదేవీల వరకు అనుమతిస్తుండగా.. ఇతర ప్రాంతాల్లో అయితే 5 ఉచిత ట్రాన్సాక్షన్స్‌కు అనుమతి ఇస్తుంది. ఈ పరిమితి దాటితే దానికి అనుగుణంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై ఈ ఉచిత ట్రాన్సాక్షన్స్‌లో యూపీఐ బేస్డ్ లావాదేవీలు కూడా చేరనున్నాయి. వాటితో కలుపుకుని లిమిట్ దాటితే.. అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.
అయితే కొన్ని రకాల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్లపై అపరిమిత ఉచిత లావాదేవీల పరిమితి వర్తిస్తుంది. వీటిల్లో కరెంట్ అకౌంట్లలో బిజ్ లైట్ ప్లస్, బిజ్ ప్రో ప్లస్, బిజ్ అల్ట్రా ప్లస్, బిజ్ ఎలైట్ ప్లస్, ఫ్లెక్సీ, ప్లస్, యాక్టివ్, అసెంట్, మ్యాక్స్ అడ్వాంటేజ్, మ్యాక్స్, ప్రొఫెషనల్, ఈ-కామ్, అపెక్స్, అల్టిమా, మర్చంట్ అడ్వాంటేజ్ ప్లస్ కరెంట్ అకౌంట్, మర్చంట్ అడ్వాంటేజ్ కరెంట్ అకౌంట్ అండ్ సుప్రీం కరెంట్ అకౌంట్, స్టార్టప్ కరెంట్ అకౌంట్ వంటివి ఉన్నాయి. ఈ వినియోగదారులంతా.. ఎలాంటి ఛార్జీలు లేకుండా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలలో అపరిమిత ఉచిత లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.
ఇదిలా ఉంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇటీవల సామాజిక ప్రభావ ఆధారిత ఆవిష్కరణలకు మద్దతుగా తన పరివర్తన్ స్టార్టప్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ ద్వారా 2026 ఆర్థిక సంవత్సరానికి ఎడిషన్ కింద రూ. 20 కోట్లు పంపిణీ చేయాలనే ప్రణాళికలను ప్రకటించింది. ఈ కార్యక్రమం వాతావరణం, వ్యవసాయం, స్థిరమైన జీవనోపాధి, తయారీ మరియు ఎంఎస్ఎంఈ ఆవిష్కరణ, ఆర్థిక చేరిక, AI వంటి రంగాలతో సహా ప్రాధాన్యత రంగాలలో 10 వ్యూహాత్మక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వనుంది.
