×
Ad

HP New PCs Launch : HP కొత్త పీసీలు వచ్చేశాయి.. హైబ్రిడ్ వర్క్ కోసం సరికొత్త డిస్‌ప్లే, వెబ్ క్యామ్ కూడా..!

HP New PCs Launch : కొత్త పీసీల కోసం చూస్తున్నారా? అయితే HP నుంచి కొత్త పీసీలు మార్కెట్లోకి వచ్చాయి. ప్రత్యేకించి హైబ్రిడ్ వర్క్ కోసం అవసరమైన ఫీచర్లతో HP Pcs అందుబాటులో ఉన్నాయి.

HP launches new PCs, displays and webcams for Hybrid work environment- Know more

HP New PCs Launch : కొత్త పీసీల కోసం చూస్తున్నారా? అయితే HP నుంచి కొత్త పీసీలు మార్కెట్లోకి వచ్చాయి. ప్రత్యేకించి హైబ్రిడ్ వర్క్ కోసం అవసరమైన ఫీచర్లతో HP Pcs అందుబాటులో ఉన్నాయి. సరికొత్త డిస్‌ప్లేలు, వెబ్ క్యామ్ కూడా అందిస్తోంది. అంతేకాదు.. HP అందించే PC, ప్రింటర్ మేజర్ కొత్త కమర్షియల్ PC, డిస్‌ప్లే, స్ట్రీమింగ్ వెబ్‌క్యామ్, దేశంలోని హైబ్రిడ్ వర్క్ ఎన్విరాన్‌మెంట్‌లను మెరుగ్గా నావిగేట్ చేసేందుకు వీలుగా ఉంటుంది. ఈ కొత్త HP డ్రాగన్‌ఫ్లై ఫోలియో G3 ల్యాప్‌టాప్ టాబ్లెట్‌తో వచ్చింది.

ఇక HP 34-అంగుళాల ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్ PC, HP Z32k G3 4K USB-C డిస్‌ప్లే, HP 965 4K స్ట్రీమింగ్ వెబ్‌క్యామ్ కూడా అందించారు. HP Inc కమర్షియల్ సిస్టమ్స్ అండ్ డిస్ప్లేస్ సొల్యూషన్స్ జనరల్ మేనేజర్, గ్లోబల్ హెడ్ గ్వాయెంటె సన్మార్టిన్ మాట్లాడుతూ.. గత కొన్ని ఏళ్లుగా పనిపరమైన విధానాలతో అంచనాలు గణనీయంగా మారాయి. ప్రజలు ఎక్కడైనా సరే సులభంగా తమ పనులను పూర్తి చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే HP కంపెనీ వినియోగదారుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సరికొత్త HP PCలను మార్కెట్లో లాంచ్ చేసింది. అందులో ఏయే పీసీ ఎంత ధర పలుకుతుందో ఓసారి లుక్కేయండి.

HP launches new PCs, displays and webcams for Hybrid work environment

– HP డ్రాగన్‌ఫ్లై ఫోలియో G3 ప్రారంభ ధర రూ. 2,01,000 వద్ద అందుబాటులో ఉంది.
– HP 34-అంగుళాల AiO డెస్క్‌టాప్ PC రూ. 1,75,999 వద్ద అందుబాటులో ఉంది
– HP Z32k G3 4K USB-C డిస్‌ప్లే నవంబర్‌లో రూ. 90వేల ప్రారంభ ధరకు అందుబాటులో ఉండనుంది.
– HP 965 4K స్ట్రీమింగ్ వెబ్‌క్యామ్ రూ. 21,999కి అందుబాటులో ఉంది.
-12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో ఇంటెల్ vPro ఆధారిత HP డ్రాగన్‌ఫ్లై ఫోలియో G3 ఫోలియో పెన్‌తో వస్తుంది.

అయితే ఈ పెన్ మ్యాగ్నెట్‌గా డివైజ్‌కు యాడ్ అయి ఉంటుంది. మూడు ప్రోగ్రామబుల్ బటన్‌లను కలిగి ఉంటుంది. 30 నిమిషాల్లో వైర్‌లెస్‌గా 100 శాతం ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. ఈ డివైజ్ 32GB వరకు LPDDR5తో అప్‌గ్రేడ్ మెమరీని, 2TB వరకు స్టోరీజీని కలిగి ఉంది. కొత్త థర్మల్ సొల్యూషన్ గణనీయమైన బరువుతో PC పనితీరును ఆప్టిమైజ్ చేస్తుందని కంపెనీ తెలిపింది. HP 34-అంగుళాల ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్ డ్యూయల్ వీడియో స్ట్రీమ్‌లు, కెమెరా స్విచ్చింగ్‌కు సపోర్టుతో స్టూడియో లాంటి అనుభవాన్ని క్రియేట్ చేస్తుంది.

ఈ డివైజ్ బెస్ట్ వ్యూను కనుగొనేందుకు రూపొందించారు. మాగ్నెటిక్ 16MP (4MP బిన్డ్) కెమెరాను స్క్రీన్‌పై బహుళ స్థానాలకు తరలించేందుకు యూజర్లను అనుమతిస్తుంది. 12వ Gen Intel ప్రాసెసర్‌లతో Intel vProని NVIDIA GeForce RTX గ్రాఫిక్స్, 128GB DDR5 వరకు మెమరీని అందిస్తుంది.

Read Also : Apple iPhone 14 Max : ఆపిల్ కొత్త ఐఫోన్ 14 Max మోడల్ వస్తోంది.. సెప్టెంబర్ 7న లాంచ్ అయ్యే ఛాన్స్..!