Kona El Kahuna Electric Bike : వావ్.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ అదుర్స్.. ఒక్క ఛార్జ్‌తో 140కి.మీ రేంజ్.. ధర మాత్రం ఊహించలేరు!
Kona El Kahuna Electric Bike : కోనా ఈఎల్ కహునా ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. ఈ బైకు ధర రూ.3.33 లక్షలు ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే 140కి.మీ రేంజ్ అందిస్తుంది. ఈ-బైక్‌తో పాటు ఫ్రంట్, బ్యాక్, సైడ్ లైట్లు, కిక్‌స్టాండ్ వంటి యాక్సెసరీలను అందిస్తుంది.
Kona El Kahuna Electric Bike
- కంపెనీ eMTB బైక్‌తో సిటీల్లో కూడా ఈజీగా తిరగొచ్చు
- ఈ బైక్‌లో బోష్ పెర్ఫార్మెన్స్ లైన్ మోటార్ అమర్చారు
- సింగిల్ ఛార్జ్‌తో 85 మైళ్లు, 140కి.మీ వరకు రేంజ్
Kona El Kahuna Electric Bike : ఈ ఎలక్ట్రిక్ బైకు భలే ఉందిగా.. చూసేందుకు అచ్చం సైకిల్ లాగే ఉంది కదా.. ఇదో కొత్త ఎలక్ట్రిక్ బైకు అంట.. కోనా అనే కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ అందిస్తోంది. మౌంటెన్ ఎలక్ట్రిక్ బైక్ పేరుతో లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బైకును రిలీజ్ చేసింది. మౌంటెన్ బైక్ అయినా రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఈ ఎలక్ట్రిక్ బైకును సిటీలో తిప్పొచ్చు.. అలాగే కొండల ప్రాంతాల్లో కూడా ఈజీగా నడపవచ్చు. ఇందులో బాష్ పెర్ఫార్మెన్స్ లైన్ మోటార్, 625 Wh బ్యాటరీని అమర్చారు. సింగిల్ ఛార్జ్‌పై 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎలక్ట్రిక్ బైక్ ధర ఎంతంటే? :
కోనా ఈఎల్ అనేది కహునా ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్. దీని ధర 3,499 డాలర్లు (సుమారు రూ. 333,000 లక్షలు). కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి నేరుగా కొనేసుకోవచ్చు. కంపెనీ ఈ బైకును 4 సైజులలో అందిస్తోంది. స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ (SM, M, L, XL) ఉన్నాయి.
కహునా ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్లు :
కోనా ఈఎల్ కహునా అనేది కంపెనీ eMTB బైక్. పట్టణ ప్రాంతాలలోనూ ఈజీగా వాడొచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో బోష్ పెర్ఫార్మెన్స్ లైన్ మోటార్‌ను అమర్చారు. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో నడపగలదు. 75Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 625Wh బోష్ పవర్ట్యూబ్ బ్యాటరీని అమర్చారు. సింగిల్ ఛార్జ్‌పై ఈ ఎలక్ట్రిక్ బైక్ 85 మైళ్లు లేదా 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ 6061 అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది. 136 కిలోల వెయిట్ మోయగలదు.
ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 10-స్పీడ్ మైక్రోషిఫ్ట్ అడ్వెంట్ డ్రైవ్‌ట్రెయిన్ అమర్చారు. బాష్ ఇంటువియా 100 డిస్ప్లే కూడా ఉంది. రైడర్ స్పీడ్, దూరం, బ్యాటరీ లెవల్ మొదలైన వివిధ డేటాను చూడవచ్చు. కోనా ఈఎల్ కహునాలో 29 x 2.25 అంగుళాల ష్వాల్బే జి-వన్ టైర్లను అమర్చారు.
ఇందులో టెక్ట్రో జెమిని బ్రేకులను వాడారు. కంపెనీ ఫ్రంట్, బ్యాక్ సైడ్ లైట్లతో సహా అనేక యాక్సెసరీలను అందిస్తోంది. ఇందులో కిక్‌స్టాండ్ కూడా అందుబాటులో ఉంది. తేలికపాటి లగేజీ కోసం బ్యాక్ ర్యాక్ కూడా ఉంది.
