Lenovo Gaming Laptop : వారెవ్వా.. లెనోవా కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ చూశారా? ఖతర్నాక్ ఫీచర్లు, ధర జస్ట్ ఎంతంటే?
Lenovo Gaming Laptop : లెనోవో చైనా మార్కెట్లో లెనోవో లెకూ బెల్లేటర్ 7000 2026 వేరియంట్ కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
Lenovo Gaming Laptop
- లెనోవా లెకూ బెల్లేటర్ 7000 16-అంగుళాల డిస్ప్లే
- ఇంటెల్ కోర్ i7-13645HX ప్రాసెసర్ కూడా ఉంది
- 60Wh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు
Lenovo Gaming Laptop : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? లెనోవో నుంచి సరికొత్త గేమింగ్ ల్యాప్ టాప్ వచ్చేసింది. చైనా మార్కెట్లో లెనోవో లెకూ బెల్లేటర్ 7000 2026 వేరియంట్ అనే కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది.
ఈ లెకూ బెల్లేటర్ 7000లో 2560×1600 పిక్సెల్స్ రిజల్యూషన్, 180Hz రిఫ్రెష్ రేట్‌తో 16-అంగుళాల డిస్ప్లే ఉంది. ఇంటెల్ కోర్ i7-13645HX ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 60Wh బ్యాటరీతో వస్తుంది. లెనోవో లెకూ బెల్లేటర్ 7000 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం..
లెనోవో లెకూ బెల్లేటర్ 7000 ధర :
ధర విషయానికి వస్తే.. లెనోవా లెకూ బెల్లేటర్ 7000 ధర 7,699 యువాన్లు (సుమారుగా రూ. 105,276). ఈ ల్యాప్‌టాప్ (JD.com)లో అమ్మకానికి అందుబాటులో ఉంది.
లెనోవో లెకూ బెల్లేటర్ 7000 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
లెనోవో లెకూ బెల్లేటర్ 7000లో 2560×1600 పిక్సెల్స్ రిజల్యూషన్, 180Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో 16-అంగుళాల డిస్ప్లే ఉంది. sRGB కలర్ గామట్‌ను 100శాతం కవర్ చేస్తుంది.
ఈ డిస్ప్లే HDR, VRRకు కూడా సపోర్ట్ చేస్తుంది. 16GB DDR5 ర్యామ్, 512GB PCIe 4.0 SSDతో వస్తుంది. స్టోరేజ్ పెంచుకోవాలంటే లెనోవో డ్యూయల్ మెమరీ, డ్యూయల్ M.2 స్టోరేజ్ స్లాట్లు ఉన్నాయి.
ఈ ల్యాప్‌టాప్‌లో బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా 8GB GDDR7 VRAMతో ఎన్విడియా జిఫోర్స్ RTX 5060 జీపీయూ ఉంది. డైనమిక్ బూస్ట్ 2.0తో 115W వద్ద రన్ అవుతుంది. ఫ్రేమ్ జనరేషన్ కోసం DLSS 4కు సపోర్ట్ చేస్తుంది. గేమింగ్, వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్ కోసం పవర్ఫుల్ ఏఐ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
లెకూ బెల్లేటర్ 7000, 14 కోర్లు, 20 థ్రెడ్లు, 4.9GHz టాప్ టర్బో ఫ్రీక్వెన్సీతో ఇంటెల్ కోర్ i7-13645HX ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. లెనోవా ఇందులో ట్రిపుల్-ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్‌ను అందిస్తోంది. ఇందులో 10mm మెయిన్ పైపు, వైడ్ హీటింగ్ సహా 4 హీట్ పైపులు ఉన్నాయి.
లో సౌండ్ 200W వరకు పర్ఫార్మెన్స్ సపోర్టు ఇస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 60Wh బ్యాటరీతో వస్తుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో USB టైప్ A పోర్ట్, ఒక ఫుల్-ఫంక్షన్ USB టైప్ A పోర్ట్, HDMI 2.1 FRL పోర్ట్, గిగాబిట్ ఈథర్నెట్ పోర్ట్, 3.5mm జాక్ ఉన్నాయి.
