Mobile Bonanza Sale : ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్.. ఆపిల్ ఐఫోన్ 12, ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు!

Flipkart Mobile Bonanza Sale : ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ సమయంలో వినియోగదారులు ఐఫోన్ 12, ఐఫోన్ 14పై భారీ తగ్గింపును పొందవచ్చు. ఈ రెండు ఫోన్‌లను అసలు ధరలో సగం కన్నా తక్కువకే కొనుగోలు చేయవచ్చు.

Mobile Bonanza Sale : ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్.. ఆపిల్ ఐఫోన్ 12, ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు!

Apple iPhone 12 for Rs 12K and iPhone 14 for Rs 26K

Flipkart Mobile Bonanza Sale : ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ డిసెంబర్ 1 నుంచి ప్రారంభమై డిసెంబర్ 6 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో వినియోగదారులు భారీ తగ్గింపులతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయొచ్చు. ఈ జాబితాలో ఐఫోన్ మోడల్‌లు కూడా ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రధానంగా ఆపిల్ ఐఫోన్ 12, ఆపిల్ ఐఫోన్ 14 మోడళ్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ ఐఫోన్ అసలు ధర కన్నా చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Read Also : Apple iPhone 16 Series : కొత్త యాక్షన్ బటన్‌తో ఐఫోన్ 16 సిరీస్ వస్తోంది.. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

ఐఫోన్ 12పై తగ్గింపు ఆఫర్ :
భారతీయ మార్కెట్లో ఐఫోన్ 12 ధర రూ.49,900గా మారింది. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఈ ఫోన్‌ను 17శాతం తగ్గింపు తర్వాత రూ.40,999కి పొందవచ్చు. కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే.. 10శాతం వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు.. పాత ఐఫోన్‌పై గరిష్టంగా రూ.28,950 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.

కస్టమర్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పూర్తి ప్రయోజనాన్ని పొందితే.. ఐఫోన్ 12ని కేవలం రూ. 12,049కి కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్‌లో ఆపిల్ ఎ14 బయోనిక్ చిప్, నెక్స్ట్-జెన్ న్యూరల్ ఇంజన్ ప్రాసెసర్ ఉన్నాయి. ఈ ఫోన్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో 6.1 సూపర్ రటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 12ఎంపీ+12ఎంపీ డ్యూయల్ ప్రైమరీ కెమెరాతో పాటు 12ఎంపీ ట్రూడెప్త్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ డివజ్ ఐపీ68 రేటింగ్‌తో వస్తుంది.

Apple iPhone 12 for Rs 12K and iPhone 14 for Rs 26K

Apple iPhone 12 Discounts

ఆపిల్ ఐఫోన్ 14పై తగ్గింపు :
కొత్త ఐఫోన్ 15 లైనప్ తర్వాత, ఐఫోన్ 14 కూడా ధర తగ్గింపును పొందింది. ఈ ఐఫోన్ ధర రూ. 69,900కు తగ్గింది. ఈ సేల్‌లో 12శాతం తగ్గింపు తర్వాత ఐఫోన్ మోడల్ రూ. 60,999 వద్ద లిస్టు అయింది. మీరు కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10శాతం వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్‌పై గరిష్టంగా రూ.34,500 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.

మీరు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పూర్తి బెనిఫిట్స్ పొందినట్లయితే.. ఐఫోన్ 14 కేవలం రూ. 26,499కే సొంతం చేసుకోవచ్చు. శక్తివంతమైన ఎ15 బయోనిక్ చిప్‌తో పాటు, 6.1 అంగుళాల సూపర్ రాటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, బ్యాక్ ప్యానెల్‌లో 12ఎంపీ + 12ఎంపీ డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో అప్‌గ్రేడ్ చేసిన 12ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఐఫోన్ డివైజ్ అప్‌గ్రేడ్‌లు, ప్రీమియం ఫీచర్‌లతో వస్తుంది. పవర్‌ఫుల్ బ్యాటరీ ఫుల్ డే బ్యాకప్‌ను అందిస్తుంది.

Read Also : Maruti Suzuki Jimny Price : మారుతి సుజుకి జిమ్నీ థండర్ ఎడిషన్ మోడల్ వచ్చేసింది.. జిమ్నీ కారుపై రూ. 2 లక్షలు తగ్గింపు!