Motorola Edge 50 : ఆఫర్ అదిరింది గురూ.. రూ.28వేల మోటోరోలా ఫోన్ కేవలం రూ. 15వేలకే.. ఇప్పుడే కొనడం బెటర్..!
Motorola Edge 50 : మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ ఇప్పుడు రూ. 15వేల ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ తగ్గింపు ధరకే ఎలా కొనాలంటే?

Motorola Edge 50
Motorola Edge 50 : మోటోరోలా ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. మోటోరోలా ఎడ్జ్ 60 ధర భారీగా తగ్గింది. ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే (Motorola Edge 50) సొంతం చేసుకోవచ్చు. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ప్రారంభ ధర రూ. 25,999 ఉండగా డిస్కౌంట్ ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 డిస్కౌంట్ :
ఈ ఫోన్ సింగిల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్నాయి. లాంచ్ ధర రూ. 27,999 ఉండగా, ఇప్పుడు రూ. 21,999కి అందుబాటులో ఉంది. అలాగే, గ్రీన్, పింక్ రెండు కలర్ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు. మరెన్నో అద్భుతమైన ఆఫర్లతో కేవలం రూ. 20వేల లోపు ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. రూ. 21,450 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత స్మార్ట్‌ఫోన్ ద్వారా రూ.6వేలకు ఎక్స్చేంజ్ చేసుకుంటే.. కొత్త స్మార్ట్‌ఫోన్ రూ.15వేలకే వస్తుంది. అయితే, పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ బట్టి వాల్యూ ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 స్పెసిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల కర్వడ్ అమోల్డ్ (Motorola Edge 50) డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఆకట్టుకునే 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుంది.
ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ ప్రీమియం వీగన్ లెదర్ ఫినిషింగ్ కలిగి ఉంది.