LPG Prices Hiked : సామాన్యులకి షాకిచ్చిన ఆయిల్ కంపెనీలు.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

LPG Prices Hiked : నెల ప్రారంభం అయిన కొన్ని గంటలకే ఆయిల్ కంపెనీలకు సామాన్యులకు భారీ షాకిచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచాయి.

oil companies hikes Commercial LPG Prices Hiked By Rs 195 5 No Changes In Domestic Rates

  • సామాన్యులకు భారీ షాక్
  • వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెంపు
  • రూ.195.50 మేర పెంపు

LPG Prices Hiked :

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో.. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే దేశంలో గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఆయిల్ కంపెనీలు ఏప్రిల్ 1న భారీ షాకిచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచాయి. సాధారణంగా ఆయిల్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తారీఖున గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. అయితే గత కొన్నాళ్లుగా దేశంలో డొమెస్టిక్ (గృహ వినియోగ) సిలిండర్ ధరల్లో మార్పులు చేయడం లేదు. కానీ, వాణిజ్య వినియోగానికి వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచుతున్నాయి. పైగా ఇప్పుడు మార్కెట్‌లో వీటి కొరత కూడా తీవ్రంగా ఉంది. దీనికి తోడు తాజాగా గ్యాస్ కంపెనీలు బుధవారం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 195.50 మేర పెంచాయి.

తాజా పెంపుతో పలు నగరాల్లో వాణిజ్య సిలిండర్ ధర రెండు వేల రూపాయలు దాటింది. ఈ క్రమంలో రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 2,078.50కి చేరిందని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. మార్చి 1న 19 కిలోల సిలిండర్‌పై రూ. 114.50 పెంపు జరిగింది.

అయితే గృహ వినియోగ ఎల్పీజీ (14.2 కిలోల సిలిండర్) ధరలు మార్చి 7న రూ. 60 పెరిగాయి. ఆ తర్వాత వాటి ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 913గా ఉంది.

ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం.. ప్రతి నెలా మొదటి తేదీన అంతర్జాతీయ మార్కెట్ ధరలు, మారకపు విలువల ఆధారంగా ఎల్పీజీ (LPG), ఏటీఎఫ్ (ATF) ధరలను సవరిస్తుంటాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు సుమారు 50 శాతం పెరిగాయి.