OnePlus 12 Price : పండగ చేస్కోండి.. అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 ధర భారీగా తగ్గిందోచ్.. ఇలా చేస్తే మీ సొంతమే!
OnePlus 12 Price : వన్‌ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్.. అమెజాన్‌లో వన్‌ప్లస్ 12పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ డీల్ అతి తక్కువ ధరకే ఎలా పొందాలంటే?

OnePlus 12 Price
OnePlus 12 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 12 ధర భారీగా తగ్గింది. ప్రీమియం డిజైన్, ఆకర్షణీయమైన డిస్‌ప్లేతో పాటు పర్ఫార్మెన్స్ పరంగా హైరేంజ్ అందిస్తుంది. అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 ధర డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత డిస్కౌంట్ ధరకు ఫోన్ కొనేసుకోవచ్చు.
ఆసక్తిగల కొనుగోలు దారులు రూ. 13,001 వరకు సేవ్ చేసుకోవచ్చు. భారత మార్కెట్లో రూ.64,999కి లాంచ్ అయిన ఈ ఫోన్ అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్, భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఈ ఫోన్ రూ.50వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 ధర :
ప్రస్తుతం వన్‌ప్లస్ 12 రూ.51,998 ధరకు అందుబాటులో ఉంది. రూ.13,001 తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్‌ను మరింత తక్కువకే పొందాలంటే HDFC వంటి ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కస్టమర్‌లు రూ.2వేలు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈఎంఐ ఎంచుకుంటే.. కస్టమర్‌లు రూ.3,250 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఈఎంఐ నెలకు రూ.2,521 నుంచి ప్రారంభమవుతుంది.
కొనుగోలుదారులకు నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు పాత ఫోన్ ఉపయోగిస్తుంటే.. కొత్త వన్‌ప్లస్ 12తో రిప్లేస్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ కండిషన్ మోడల్, వేరియంట్, అప్లియన్సెస్ బట్టి రూ. 22,800 వరకు పొందవచ్చు. కొనుగోలుదారులు వన్‌ప్లస్ కేర్ యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్, మొబైల్ డ్యామేజ్ ప్రొటెక్షన్, అదనపు మొబైల్ వారంటీ యాడ్-ఆన్‌లను కూడా పొందవచ్చు.
వన్‌ప్లస్ 12 స్పెసిఫికేషన్లు :
ప్రపంచవ్యాప్తంగా వన్‌ప్లస్ 12 ఫోన్ 120hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల 2K అమోల్డ్ ప్యానెల్‌తో వచ్చింది. 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 SoC నుంచి పవర్ పొందుతుంది. 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ 5,400mAh బ్యాటరీని కలిగి ఉంది.
100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్ 50MP సోనీ LYT808 సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 64MP ఓమ్నివిజన్ OV64B పెరిస్కోపిక్ లెన్స్, 48MP సోనీ IMX581 షూటర్‌ను అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందిస్తుంది.