OnePlus 13s : ఇది కదా డిస్కౌంట్.. వన్‌ప్లస్ 13s ఆఫర్ అదిరింది.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్!
OnePlus 13s : వన్‌ప్లస్ 13s ఫోన్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. అమెజాన్ సేల్ సమయంలో బ్యాంకు ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లతో చౌకైన ధరకే కొనేసుకోండి.

OnePlus 13s
OnePlus 13s : వన్‌ప్లస్ అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ డీల్స్‌లో వన్‌ప్లస్ 13s మోడల్ ఒకటి. కాంపాక్ట్, వెయిట్ లెస్ ఫోన్లను ఇష్టపడేవారు తప్పక కొనాల్సిన ఫోన్.
వన్‌ప్లస్ 13s అద్భుతైమన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ (OnePlus 13s) ఫెస్టివల్ సేల్ సమయంలో మీరు రూ. 48వేల లోపు ధరకు వన్‌ప్లస్ 13s కొనేసుకోవచ్చు. ఈ వన్‌ప్లస్ 13s డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వన్‌ప్లస్ 13s అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13s రూ.54,999 ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.50,999కి అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ వన్‌ప్లస్ 13పై రూ.4వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాదు.. మీరు యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.3,250 తగ్గింపును పొందవచ్చు.
వన్‌ప్లస్ 13s స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 13s ఫోన్ 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 460ppiతో 6.32-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ 1,600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో డాల్బీ విజన్, HDR10+, హెచ్‌డీఆర్ వివిడ్‌లను సపోర్ట్ చేస్తుంది. హుడ్ కింద వన్‌ప్లస్ నుంచి వచ్చిన ఈ కాంపాక్ట్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB LPDDR5X, 256GB, 512GB యూఎఫ్ఎస్ 4.0తో వస్తుంది. ఇంకా, వన్‌ప్లస్ 13s ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,850mAh బ్యాటరీతో వస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13s ఫోన్ 50MP సోనీ LYT-700 ఓఐఎస్‌తో 50MP (2X ఆప్టికల్ జూమ్) టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఈ హ్యాండ్‌సెట్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపీ కెమెరాను కలిగి ఉంది. వన్‌ప్లస్ 13s ఇతర ముఖ్యమైన ఫీచర్లలో Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, డ్యూయల్-సిమ్, USB టైప్-C, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్, ఐఆర్ రిమోట్, గైరోస్కోప్ వంటి ఇ-కంపాస్ ఉన్నాయి.